పుట:AndhraKavulaCharitamuVol2.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డయిన మల్లారెడ్డి కవీశ్వరుడు చెప్పిన యీక్రింది పద్యమునకు రాజులందఱును గోపించి యుద్ధసన్నద్ధులయినప్పుడు మల్కిభరామువారిని వారించి శాంతపఱచినట్టొక పుస్తకమున వ్రాయబడియున్నది.


చ. బలరిపుభోగ కృష్ణనరపాలునిపేరకుమారమల్ల మీ

కలితయశ:ప్రభావములు కన్గొనలే కలకట్టుమన్నెమూ

కలు తల లొల్లరో బిరుదుగద్దియముల్ చదివించుకొందు రౌ

కొలదియెఱుంగజాల కలకుక్కలు చుక్కలజూచి కూయవే.


పయిని జెప్పిన యితరరాజుల కవులు చెప్పినపద్యములుకూడ నింపుగా నుండవచ్చును గాన వాటిని వరుసగా నిందు క్రింద బొందుపఱుచు చున్నాను.-


ఉ. చాలుగుఱాలు మాళిగడిసంగడిరాజులు గొల్వరండహో

హాలమహోగ్రఫాలదహనాక్షునియంతటిధాటివాడు నా

యేలిక వేంకటాద్రిధరణీశునితిమ్మడు పెమ్మసానిభూ

పాలుడు హెచ్చు ధాత్రి గలపార్థివు లెల్లను లొచ్చు వీనికిన్.


ఉ. మట్టకరాడు బెట్టురికి మన్నెకుమారుల సీమ ధూళిగా

గొట్టకమాన డేగద యకుంఠితసింహతలాధిరాయ డీ

పెట్టినదండు దీడు రణభీష్ముడు హండియయప్ప శౌరికిం

బెట్టుడు వేగ దండములు బింకము లేటికి శత్రుభూపతుల్.


ఉ. కొద్దినిరాడు దిండుఱికి కోటులుకొమ్మలు గొన్నశూరు డా

గద్దఱిగబ్బిరాచపులి గండరబాలుడు మట్లనంతు డే

ప్రొద్దును వైరిభూభుజులపొంక మడంపనె పుట్టినాడు మీ

పెద్దఱికాలు సాగ విక బ్రేలకుడీ గడిమన్నెభూపతుల్.


ఉ. టెక్కున గొండతో దగరు డీకొని తాకినజోక గాక యీ

బిక్కపకీరుమన్నెసరిబేసిదొరల్ మొన లందు నిల్వ నా