పుట:AndhraKavulaCharitamuVol2.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యమునకు వచ్చి 1585 వ సంవత్సరము వఱకును రాజ్యముచేసి స్వర్గస్థు డయ్యెను. 1585 వ సంవత్సరమునకు సరియైన పార్థివసంవత్సర మాఖశుద్ధదశమినా డాతని తమ్ముడైన వేంకటరాయడు సింహాసనమునకు వచ్చినతోడనే తనరాజధానిని పెనుగొండనుండి చంద్రగిరికి మార్చి 1614 వ సంవత్సరము వఱకును రాజ్యముచేసి సంతాన హీనుడయి పరమపదమును బొందెను. నంద్యాల రాజైన కృష్ణరాజు సదాశివదేవరాయని కాలములోనివాడై నందున, అతని రాజ్యకాలము 1564 వ సంవత్సరమునకు లోపల నారంభమై యుండును. కాబట్టి పింగళి సూరన్న నంద్యాలసంస్థానము నందుండి కృష్ణరాజునకు గళాపూర్ణోదయము నంకితముచేసిన కల మించుమించుగా 1560 వ సంవత్సరప్రాంత మని చెప్పవచ్చును. ఈసదాశివదేవరాయ డచ్యుతదేవరాయని కుమారు డయినట్టు కొన్ని శిలాతామ్రశాసనములయందు జెప్పబడినదిగాని కృష్ణామండలములోని సత్తెనపల్లె తాలూకాలో దొరకిన శాలివాహనశకము 1482 సిద్ధార్థిసంవత్సరమునకు సరియైన హూణశకము 1560 వ సంవత్సరపు సదాశివరాయల తామ్రశాసనములో నతడు రంగరానకును తిమ్మాంబకును బుత్రు డయినట్టును రామరాజునకు మఱదియైనట్టును ఈక్రింద శ్లోకముచే జెప్పబడినది:-


"తిమ్మాంబావరగర్భమౌక్తికమణీ రంగక్షితీంద్రాత్మజ

అత్రాలంకరణేన పాలితమహాకర్ణాటరాజ్యశ్రియా

శౌర్యౌదార్యదయావతా స్వ భగినీభర్త్రా జగత్రాయిణా

రామాఖ్యప్రభుణా వ్యమాత్యతిలకై:క్దుప్తాభిషేకక్రమ:"


ఈ శ్లోకమునందలి రంగక్షీతీంద్రుడన్నది ప్రమాదజనితమేమో! నంద్యాలకృష్ణరాజు వేంకటపతిరాయల రాజ్యారంభదశలోను జీవించి