పుట:AndhraKavulaCharitamuVol2.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముఖుండై సుఖసంకథావినోదంబున పృథివీరాజ్యము సేయుచునుండి

శకవర్షంబులు 1216 అగు జయసంవత్సర మార్గశిర శుద్ధ దశమి

రవివాసరంబునందు స్వరాష్ట్ర సమస్త ప్రజారక్షణార్థము గిరిదుర్గము

రచియించెను."


అని కాకతీయప్రభువుల కాలములో శాలివాహన శకము 1216 వ సంవత్సరమునం దనగా క్రీస్తుశకము 1294 వ సంవత్సరమునందు గొఱ్ఱె గంగయ్యయు నొకానొక విఠ్ఠలరాజును ఉన్నట్లు చెప్పబడి యుండుటచేతను.


ఉ. "బొంకనిధర్మజుం డడుగబోవనిపన్నగశాయి యాజిలో

గొంకనియర్జునుండు కఱకుందులు లేనిశశాంకు డెన్నడున్

గ్రుంకనిభాను డన్యసతి గోరనిజిష్ణు డనంగబొల్చు ధ

ర్మాంకుడు విఠ్ఠలక్షితివరాగ్రణి మానధనాగ్రగణ్యుడై


మ. తనకు న్నెచ్చెలి యైనక్రీడిపయి నంతర్మోహబంధంబు పో

వనవాడై హరి విఠ్ఠలేశ్వరుడు తద్వంశంబునన్ సంపదల్

తనర న్నల్వదియేస్తరంబు లగునంతం దిమ్మభూపాలనం

దనుడై విఠ్ఠలరాజమూర్తి పొలిచెన్ ధర్మావనోద్యోగితన్"


ఇత్యాది పద్యములలో బాలభాగవతమునం దొకవిఠ్ఠలరాజు వర్ణింపబడియుండుట చేతను, ఆవిఠ్ఠలరాజే యీవిఠ్ఠలరాజని భ్రమించి యీ కవియు విఠ్ఠలరాజును పదునాల్గవ శతాబ్దారంభమునం దున్నట్లు వ్రాసియున్నారు. కాని వారు వివరించినకాలము సరియైనది కాదు. కాకతీయప్రభువుల కాలములో నున్న విఠ్ఠలరాజు వేఱొకడు కాని యీతడు కాడు. అత డొకవేళ రంగనాథరామాయణకృతికర్తయగు కోనబుద్ధరాజుతండ్రియైన విఠ్ఠలరాజయిన నయి యుండవచ్చును. కోనేరు కవి తనబాలభాగవతము నందు పదునేనవశతాబ్దారంభమం దున్న శ్రీనా