పుట:AndhraKavulaCharitamuVol2.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18. దోనూరి కోనేరుకవి

ఈ కోనేరుకవి తెలుగున బాలభాగవతమును రచియించెను. ఇతడు నియోగి బ్రాహ్మణుడు; శ్రీవత్సగోత్రుడు; ఆశ్వలాయన సూత్రుడు; దోనూరి నాగయ్యమంత్రి పుత్రుడు. కవి తనవృత్తాంతమును బాలభారతములోని యీక్రిందిపద్యమునందు జెప్పుకొని యున్నాడు:-


సీ. శ్రీమదహోబిలశ్రీనృసింహసమగ్రకరుణావివేషప్రకాశమహితు

భానురసంస్కృతప్రాకృతాదికశాస్త్ర భాషాకవిత్వ సౌభాగ్యనిపుణు

జనవర్ణి తాశ్వలాయనసూత్రపావను శ్రీవత్సగోత్రాబ్ధిశిశిరకరుని

సారస్యవినుతు దోనూరి నాగయమంత్రిపుత్రుడనై నట్టి బుణ్యచరితు

జతుర భూనాయకాస్థాన సకలసుజన

వందితుని నన్ను గోనేరు నాథసుకవి

నర్థి బిలిపించి సత్కార మాచరించి

పలికె నిట్లని గంభీరభాషణముల


ఇట్లు కవిని బిలిపించి గ్రంథరచన చేయమన్నది తిరుమలరాజు. ఈ తిరుమలరాజు వసుచరిత్రము కృతినందినయతడుగాక యాతని పెద్దతండ్రి కుమారుడయిన మఱియొక తిరుమలరాజు. బాలభాగవతము నందు జెప్పబడిన వంశానుక్రమమునుబట్టి యార్వీటి బుక్కరాజునకు తిమ్మరాజనియు, కొండరాజనియు, శ్రీరంగరాజనియు ముగ్గురు కొమాళ్లు గలరు. వారిలో నగ్రజు డయిన తిమ్మరాజునకు భార్యయైన గోపమాంబ వలన తిరుమలరాజనియు, విట్ఠలరాజనియు, చినతిమ్మరాజనియు, పాప తిమ్మరాజనియు, నలుగురు పుత్రులు గలిగిరి. వీరిలో జ్యేష్ఠుడయిన తిరుమలరాజు కాలమునం దీ బాలభాగవతము రచింపబడినది. ఈ తిరుమలరాజు తండ్రియగు తిమ్మరాజునకు తమ్ముడయిన శ్రీరంగరాజునకు కోన