పుట:Andhra-Vedhamulu-Krishnayajurvedamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రవర్తిల్లచేయుట పరమకర్తవ్యముగా ప్రత్యక్షమయ్యెను. తదుద్దేశ్యముతో ఆర్య, బౌద్ధ, క్రైస్తవ, మహమ్మదీయమతోద్గ్రంథముల నాంధ్రీకరించుటకు పూనితిమి. జారుతృష్ణ. కన్‌ప్యూషియస్ ప్రవక్తల ప్రబోధగ్రంథములనుగూడ ఆంధ్రీకరింపదలచితిమి. పశుధర్మమునుండి దైవధర్మమునకు పరిణామమందుచున్న మానవకోటి నుద్ధరింప యుగయుగాంతరముల పరమేశ్వరుడు ప్రసాదించిన మహాప్రబోధములను సర్వజనసులభముగా లభింపజేయుట, విశ్వసందేశమని రూఢియయ్యెను.

మతములలోనికెల్ల ఆది ఆర్యమతము. ఆర్యధర్మమునకు వేదముమూలము. వేదములు షడంగములతోసహా ప్రకటించుట జ్ఞానవిజ్ఞానములకు సాధనమార్గము. "ఆంధ్రావని మోదమున్‌బొరయ" ఆంధ్రవాఙ్మయము పరిపూర్ణతనొంద, ఆంధ్రుల జ్ఞానవై రాగ్యములు సర్వతోముఖవ్యాప్తిపొంద, లోకోద్భవమునకు కారణభూతుడైన పరమేశ్వరునుండి వెలువడిన ఋగ్యజుస్సామాధర్వవేదంబుల తదంగ సమేతంబుగా సుబోధకమగు శైలిలో యనువదించి ఆంధ్రవేదంబులు"గా ఆంధ్రలోకంబునకు లభింపజేయుట పరమకర్తవ్యము. ఇట్లు మనోవీధిలో తాండవమాడుచున్న భావపరంపరలకు కాలపరిణామముబట్టి కార్యరూపమొందు కాలము సంఘటిల్లెను. ఒకానొక స్నేహితుని వాగ్దత్తము అవలంబనమయ్యెను. చిరకాల స్నేహితులును, సంపన్న గృహస్థులును, అగు శ్రీయుత ఆలపాటి దేవయ్యగారు యజుర్వేద శాఖలలో నొకదానికి పూనుకొని తనకుమారుడు వెంకటకృష్ణయ్యగారిద్వారా 23 - 12 - 37 తేదీన జరుపబడిన వార్షికోత్సవమపుడు చదివించిన ధనము కార్యోపక్రమణకు తోడ్పడెను. తాతలనాటినుండి మాకుటుంబమునకు పోషకులుగానున్న శ్రీ రాచూరు జమీందారగు శ్రీరాజా మాణిక్యారావు వెంకటహయగ్రీవరావు బహదూరుగారు గత ముక్కోటిఏకాదశినాడు తనుతల్లి శ్రీరాజా రాజలక్ష్మాయమ్మ బహదురుగారి జ్ఞాపకార్ధమై శుక్లయజుర్వేదమునకై యిచ్చిన సనదుమరింతప్రోత్సాహ మొనర్చెను. ఆశ్రమ రాజపోషకుడు శ్రీయుతమద్ది వెంకటరంగయ్యగారు సామవేదమును భరించసమకట్టుట సంతోషప్రదమయ్యెను. బాల్యస్నేహితుడు శ్రీయుతమంతెన సుబ్బరాజుగారు తనతండ్రి జ్ఞాపకార్ధమై ఋగ్వేదభారమును వహించి కార్యలోపమురాకుండ