పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరిలో బసవన్న ప్రముఖుఁడు. కృతిరచనాకాలమునకు వలయుఁ జరిత్రాంశము లీతని ప్రశంసాపద్యములనుండియే గ్రహింపవలసియున్నది. బసవన్న భార్య అమ్మలాంబ పాకనాటిలోని అల్లూరి అనమారారెడ్డి మనుమరాలు. పెమ్మమహీపతి కుమార్తె. బసవన్నను గూర్చి సూరనార్యుఁ డిటులఁ బ్రశంసించినాఁడు.—

క.

“వారలలోపల బసవ, క్ష్మారమణుఁడు పేరు పెంపు గలమన్నీఁడై
భూరిప్రతాపజయల, క్ష్మీరతుఁడై వెలసె నుదయగిరిరాజ్యమునన్."

(ఆ.1 ప.37)


సీ.

"కటకాధిపతి యైనగజపతిరాజుచేఁ బ్రతిలేనిపల్లకి పదవు లందె
మహిమచేఁ గర్ణాటమండలాధిపుచేతఁ గడలేని రాజ్యభాగములు గాంచె
ప్రౌఢపౌరుషమున రాజిల్లి మెఱయఁగా మలకపజీర్ణ కుమ్మలికఁ జేసె
తెలగాణభూములఁ గల మన్నెవారిచే బలవంతమునను గప్పములు కొనియె


తే.

చాటుధాటీనిరాఘాటఘోటకావ, లీఖురోద్ధూనిబిడధూళీవిలిప్త
మండితాశాంగనాకుచమండలుండు, బాహుబలశాలి తమ్మయబసవవిభుఁడు.”

41

కృతికర్త తండ్రియగు బసవనృపాలుఁడు గజపతులకాలమునందుండి యాందోళికాదిగౌరవములు బడసెను. కర్ణాటనృపులచే రాజ్యములను బడసెను. గజపతులయనంతరము ఉదయగిరిదుర్గాధిపత్యముగూడ వహించెను. కాన బసవభూపాలునికాలము తెలిసికొన యత్నించుదము, కృష్ణదేవరాయలకాలమున కొండవీడు,