పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విష్ణుపురాణమును దెనిఁగించినది వెన్నెలకంటి సూరయకవి. ఇతఁడు నియోగి బ్రాహ్మణుఁడు. తాత సూరనామాత్యుఁడు, తండ్రి అమరనామాత్యుఁడు. హరితసగోత్రుఁడు. విష్ణుపురాణముదక్క నితరగ్రంథము లేవి రచించెనో తెలియదు. గద్యములో నీకవి విష్ణుపురాణము బ్రహ్మాండపురాణములోని దని తలంచి కాఁబోలు "ఆదిపురాణం బగు బ్రహ్మాండంబునందలి పరాశరసంహిత యైనవిష్ణుపురాణమునందు” అని వ్రాసినాడు. ఇది యెట్లు పొసఁగునో తోఁపదు. అష్టాదశపురాణములలో విష్ణుపురాణ మొక్కటి. చూడుఁడు—

శ్లో.

[1]“బ్రాహ్మం పాద్మం వైష్ణవం చ శైవం లైంగం చ గారుడం
నారదీయం భాగవత మాగ్నేయం స్కాందసంజ్ఞికమ్
భవిష్యం బ్రహ్మవైవర్తమ్ మార్కండేయం చ వామనమ్
వారాహమత్స్యకౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్."

పురాణములయందు బ్రహ్మాండాంతర్గతమని విష్ణుపురాణము వేరేని చెప్పిరేమో? విచారణీయము.

విష్ణుపురాణము మూలమును నెనుబదివేలగ్రంథముగా (పరాశరమహర్షి చెప్పినటుల) వ్యాసులవారు రచించిరి. ఇది రెండుభాగములు. దాదాపుగా మొదటి భాగమును వెన్నెలకంటి సూరనకవి తెనిఁగించినాఁడు. రెండవభాగమునందు వివిధధర్మములు, వ్రతనియమాదులు, ధర్మశాస్త్రరహస్యములు, అర్థశాస్త్రము,


  1. బ్రహ్మాండము, విష్ణుపురాణములకు సంబంధము లేదని యీకవియే చెప్పినాఁడు. చూడుఁడు-
    మ. "భువి బ్రహ్మాండము వామనంబు గరుడంబు స్కాందమున్ గూర్మభా
          గవతాగ్నేయకమాత్స్యలైంగములు మార్కండేయమున్ బాద్మవై
          ష్టవశైవంబులు నారదీయము భవిష్యద్భహ్మకైవర్తది
          వ్యవరాహంబులు నాఁ బురాణములు ముయ్యాఱయ్యె విప్రోత్తమా." (విష్ణువు. అ 4 ప 99.)