పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వర్ణనములలోఁ జూవునిసర్గరమణీయభావసమృద్ధి సూరనార్యుని విష్ణుపురాణములోఁదక్క నితరాధునికగ్రంథములలోఁ గానరాదు. నిరర్గళమగునీతనిశైలి కొన్నికొన్నియెడల శ్రీనాథునిశైలి ననుకరించినతావులు గలవు. కొలఁదిగ కృత్యాదియందుఁ బ్రబంధకవుల వర్ణనపద్ధతి ననుకరించినాఁడు. అంతియగాని యితరస్థలములలో సూరనార్యుఁడు తనకవిత స్వతంత్రరీతి నలరించినాఁడు. కథాంశములలో వచ్చు నాయారసముల నౌచితి నెఱింగి సమయానుకూలముగ వర్ణించుటయందును గథాంశమును బెంచి గ్రంథప్రశస్తి నినుమడించుటయందును నీకవివరున కుత్సాహము మెండు. ఇంతియగాదు. మధ్యకాలపుఁగవులవలె శృంగారము నతిమాత్రముగ వర్ణించి కథోద్వేగము చల్లార్పుట యీకవియెడఁ గానరాదు. విష్ణుపురాణము వంటి మహాపురాణము వ్రాయుట కీకవి యన్నివిధములఁ దగినవాఁడు. ద్వితీయాశ్వాసములోని మారిషవృత్తాంతము పంచమాశ్వాసములోని తారాశశాంకచరిత్రము జూచిన నీకవికిఁ గల శృంగారరసకల్పనమున నౌచితిఁ గూడఁ గొంతవఱకు బాటించువాఁడని తెలిసికొనవచ్చును.

నరకాసురవధము, ప్రహ్లాదచరిత్రము, ధ్రువోపాఖ్యానము, శ్రీకృష్ణావతారఘట్టము, రుక్మిణికల్యాణము లోనగుకథాభాగము లీవిష్ణుపురాణమున సంగ్రహరూపముగ నున్నవి. పోతనరచనమునకుఁ దీసిపోవుచున్నది. ఈ భేదము పోతన చిత్రకవితాప్రియుఁడు, సూరన నిరర్గళధారావశంవదుఁడు నగుటచే నేర్పడినది. కావున నాయాభాగములు గైకొని తారతమ్యచర్చ గావించుట యుచితము గాదని మాతలంపు.

విష్ణుపురాణమునందలి కథలకును భాగవతమునందలి కథలకును గొంతమార్పు కానవచ్చుచున్నది. కారణము తెలియదు. భాగవతమున ఉత్తానపాదునకు సునీతి పెద్దభార్యగను సురుచి చిన్నభార్యగను జెప్పఁబడియుండ విష్ణుపురాణములోఁ దలక్రిందుగా నున్నది. విష్ణుపురాణములో ధ్రువుఁడు తనంత తపమునకుఁ బోయినటులుండ భాగవతములో తల్లిమాటలమీఁద నేగినటులను, విష్ణుపురాణములో సప్తర్షులు ధ్రువునకు ద్వాదశాక్షరి నుపదేశించినటులుండ భాగవతములో నారదమహాముని వాసుదేవమహామంత్ర ముపదేశించినట్లును గలదు. విష్ణుపురాణములో దేవతలు మాయావిని బంపి ధ్రువునితపము కలచినటులుండ భాగవతములో నావిషయమే లేదు. ఈకథలో నింక నెన్నియోమార్పులు గలవు. ఇటులెఁ దక్కినకథలలోఁగూడ మార్పు లారయనగును. పురాణములను జరిత్రదృష్టితో సమన్వ