పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లో బంధీకృతుఁ డైనదిమొదలు వీరు స్వతంత్రులైరి. స్వతంత్రరాజ్యస్థాపకులలో అనపోతనాయకుఁడు మొదటివాఁడు. ఈతఁడు మహాసంగరములలో గెల్చి దక్షిణాపథమునందలి యాంధ్రదేశమునంతయుఁ బాలించెను. క్రమముగా నీతనివంశజులు మ్లేచ్ఛరాజుల యొత్తిడి కాగఁజాలక పూర్వార్జితరాజ్యములు గోలుపోయి చివరకు దేవరకొండదుర్గమును రక్షించుకొనిరి. అక్కడ కూడ నిలువ వీలుజిక్కకపోవుటచే దుంగభద్ర దాటి కృష్ణదేవరాయకాలములో కర్నూలుమండలములోని వెలుగోటిలో రాజ్యము స్థాపించి రాయల కంకితులైరి. ఇ ట్లొనరించినది నిర్వాణరాయఁడప్ప. ఈయంశము లోకల్ రికార్డులందును కర్నూలు జిల్లా మాన్యుల్ లోను వెలుగోటివంశచరిత్రమునందును జెప్పఁబడినది. నిర్వాణ రాయఁడప్ప వెలుగోటిలోఁ గోటకట్టినది క్రీ.శ. 1530 ప్రాంతమున నుండె నని చెప్పఁబడెను. అదిమొదలు రేచెర్లగోత్రీయులు వెలుగోటివారని పేరొందిరి తరువాత యాచనామము, వేంకటగిరిసంస్థానపాలనము సిద్ధించినది. ఇందుచేఁ బైని పేర్కొనబడిన వెలుగోటి తిమ్మనృపాలుఁడు క్రీ.శ. 1530 కు ఈవలివాఁ డగుట స్పష్టము. నిర్వాణరాయఁడప్ప కుమారుఁడు మనుమఁడు మునిమనుమఁడు గూడ తిమ్మానాయకులె. ఈమువ్వురికిఁ బైనఁ దిమ్మానాయకుఁడు లేడు. ఉండెఁబో వానికి వెలుగోటివంశనామము లేదు. మువ్వురు తిమ్మానాయకులలోఁ జివర తిమ్మానాయకుని కాలము క్రీ.శ. 1572 - అనఁగా చంద్రగిరిలో తిరుమలదేవరాయలకుమారుడు రాజ్యమేలుకాలము. వెలుగోటి తిమ్మభూపాలుని శాసనములు రెండు లభించినవి. అందొకటియగు నెల్లూరు రంగనాయకులగుడి ఉత్తరపుగోడమీఁది శాసనము.

స్వస్తిశ్రీజయాభ్యుదయ శాలివాహనశకవర్షంబులు 1495 అగునేటి శ్రీముఖసం॥ వైశాఖ శు 15 లు శ్రీమద్రాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీవీరప్రతాప శ్రీరంగరాయదేవ మహారాయలు అయ్యవారి కార్యకర్తలయిన వెలుగోటి తిమ్మపనాయనంగారి ముద్రకర్త వెంకటప్పనాయండు రాయలవారికిన్ని తిమ్మపనాయనికిన్నీ పుణ్యముగాను ......... వివరం

వేంకటగిరి సంస్థానమునకుఁ జెందిన పొదిలెదుర్గాలయములో నున్న శిలాశాసనము.

స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహనశకవర్షంబులు 1515 అగు స్వభానుసంవత్సర శ్రావణ శు 10 లు శ్రీనుతు రేచర్లగోత్రోద్భవులైన వెలిగోటి పెదతిమ్మానాయనింగారి పౌత్రులైన కొమారతిమ్మానాయనింగారి పుత్రులైన కుమార