పుట:Andhra-Natakamulu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పీ ఠి క.

               ---
   యీగ్రంధమందలి మొదటియధ్యాయమును ప్రసిద్ధ నాటక వాజ్మయాభిమానియగు పురాణం సూరిశాస్త్రి గారి ప్రోత్సాహముచేవ్ 1926 సం॥లో వ్రాసి కృష్ణాపత్త్రిక లో బ్రచురించితిని. తరువాత గొన్ని వత్సరములవఱకు పింగళి సూరనార్యకవి జీవితరఛనానిమగ్నుడనై యీ నాటకగ్రంధవిషయమును గట్టివెట్టితిని. ఇటీవల "సారస్వతసర్వస్వము" పత్త్రి హేధిపతియగు ఏలూరిపాటి రామభద్రచైనులుగారు తమ పత్త్రికకు గొన్ని వ్యాసములను బంపుమని కోరగా మూడవ అధ్యాయభాగము వ్రాసి వారిపత్త్రికకు బంపితిని. నాల్గవ యధ్యాయ మాంధ్రసాహిత్య పరిషత్తులో జరుపబడినది. గ్రంధమును బూర్తిచేసెడు తలంపుతో మిగిలిన రెండధ్యాయములను రచించి యన్నిటిని పుస్తకరూపముగా బ్రకటించితిని. ఈగ్రంధమందేదైన సుగుణలేశమున్నయెడల సరసులు గ్రహించి సంతసించిన నాశ్రమయంతయు సార్ధమమైనదని తలంచెదను.
   నేను గ్రామాంతరము తెళ్లినకాలములొ మొదటి రెండధ్యాయములు ముద్రింపబడుటచే ఋజుగు పత్రములు (Proofs)  సరిగదిద్దుటకు వీలులేక కొన్ని అచ్చుతప్పులుండిపోయినవి. వానినన్నిటిని శుద్ధపట్టికలో జేర్చితిని. సహృదయులీలోపమును క్షమింతురుగాక.