పుట:Andhra-Natakamulu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

55

ఉపసంహారము.

షులు సంఘమందలి నీతికట్టుబట్ల నతిక్రమించుటయు, దోష వర్తనముల సంచరించుటయు, మున్నగు కారణములచే బ్రజలకు వారియెడ గౌరవములేకపోవుట సంబవించెను. బైరను మహాకవి (Byron) చెప్పినట్లు "Maidens like moths are ever caught by glare." అనగా యువతీమణులు శలభములవలె గాంతిప్రభలకులోన యి మ్రందుదురు. విద్యుద్దీపకాంతులును మృదుమధురసంగీత నివ్వనములును, సువర్ణమయాంబరిభూషణములును, నర్తకీచంచల విలాసములును, మున్నగు చిత్తభ్రమణవిశేషములతో నలరారు నాటకరంగస్థలములు యువతీయువకుల యుల్లంబుల మనోవికారములు జనింపకుండ జేయు టెట్లు? కావున నాటకులును, నాటకాధికారులును తమ స్వజీవితములయందు గట్టుదిట్టములు జేసియు నిత్యాదిపరిశుద్ధజీవితస్ఫురితములగు కార్యములు నిర్వహించినయెడల వారిని గురించి ప్రజాభిప్రాయములు మారగలవు. రంగస్థలముల యందు శృంగారాదిరసముల వెలివఱచు చున్నను సంఘజీవితములో శృంగారాదిరసముల వెలివఱచు చున్నను సంఘజీవితములో యుక్తప్రవర్తకులై యుండవలెను. లేనియెడల వారికియపకీర్తియేగాక వారవలంబించిన వృత్తికి గూడ నవయశస్సే!

   ఇంగ్లాండు దేశమున నిప్పుడు గొప్పనటీనటులు బహు సమ్మానితమగు పదవులయందుండుటయు, గొప్పబిరుదములందుటయు వినుచున్నాము. వెనుకటికాలమందు గ్యారికు, సిడ