పుట:Andhra-Natakamulu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
54

ఆంధ్రనాటకములు.

గూర్చి యింతపరిశ్రమజేయుటకుగారణమేమన-- ప్రజాబోధనమునకు నాటకములొక ముఖ్యసాధనమని నాకుగలిగినదృఢమైననమ్నకము.

     ప్రజలయందలి నీత్యవినీతుల నిర్ణయించుట కాదేశోమందలి నాటకములే సాక్ష్యములని మహావిమర్శకులు జెప్పుచున్నారు. ప్రాచీనగ్రీకుల యొక్కయు, రోమనులయొక్కయు సమగ్రమైన నాగరికతను ద్యోతకపరచెడి యాధారములాదేశము లందలి  ప్రాచీననాటకౌలని చరిత్రకారుల్లు చెప్పిన యధార్దము. ప్రజలయొక్క గుణగ్రహణ పారీణతం బట్టి యా దేశమందలి నాటకముల యుత్కృష్టతనిర్ణయింప బడును. కావున నాటకములను శ్రేయోమార్గముల రచించినయెడల బ్రజలునుకూడ నట్టిమార్గముల నడపించుటయేయని నిశ్చయింపవచ్చును.
    పూర్వకాలమున, నేదేశమందైనను నాటకములు జూచి సంతొషించినను, నటకుల మాత్రము ప్రజలునిరసించుట యాచారమయి యుండెను. ప్రజాసంఘమందు వారికి గౌరచ్వమైన పదవిలేదు. మొన్నమొన్నటివఱకు మనదేశమందు నిదేస్థితి. నాటకులకు జాయాజీవులని యొక పేరు. అనగా, భార్యలచే, బోషింపబడినవారు. ఆమాటయందు నింద్యార్ధముగర్బితము, భాగవతపు వాళ్ళని నాటకులను చులకదనముతో బిలుచుట నిప్పటికిని వినుచున్నాము. ఇట్టి నిరసనవాక్యము లకు నాటకులయందలి నికృష్టజీవనము ముఖ్య కారనమని నిష్పక్షపాతబుద్ధికి దోపక మానదు. నాటకులలో స్త్రీపురు