పుట:Andhra-Natakamulu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
50

ఆంధ్రనాటకములు.

రగంట పట్టును. సగముకాలము పద్యము తక్కినసగముకాలము రాగముయొక్క యాలాపనము, ఒకానొకసమయమున చప్పట్లు కొట్టువఱ కాలపనము జరుగవలసినదే. ఈపద్ధతి యిపుడుమనవైపున గొంత తగ్గినద్సి గాని బళ్ళారి ప్రాంతములయందు దగ్గినటుల గాన్పింపదు. నాటకవిధానములో నగ్రస్థానముగన్న బళ్ళారియందీ లోపముతగ్గకపొవుటజాలవిచారకరము.

4.అభినయము.

     సంగీతము వలెనే యభినయమును గూడ నౌచిత్యనియమపు కట్టుదిట్టములలో నుంచవలెను. మననాటకులు భరతశాస్త్రమునంతయు జదువనక్కఱ లేదు. అది నర్తకెలలామములపని; గాని వేశ్యావనితలవలెనే కొంతమంది నటులు ప్రతిశబ్దమునందు నభినయము గన్పఱచనియెడల లోపమని తలచుచుందురు. ప్రతిమాటను చ్చరింపుచు జేతినో కాలినో కంటినో త్రిప్పుచుందురు. ఆనృత్యము భోగము మేళమువలె నుండును,గాని నాటకమువలె గాన్పింపదు. బళ్ళారి టి.రాఘవాచార్యులుగారు, నెల్లూరి నాగరాజారావు గారు, రాజమహేంద్రవ్రము జగ్గరాజు గారు మున్నగు మహానటుల యభినయము జూచినగాల్సేతులకంటె ముఖదృష్టియందే యెక్కువ నభియనముండ దగినదనియు, స్వరభేదముచే భావవికారములు ముఖ్యముగానిరూపింపబడదగినవనియు దెలియ వచ్చును. రంగస్థలమంతయునడుమద్రొక్కనటుల ద్రొక్కుట యిపుడంతగా