పుట:Andhra-Natakamulu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

49

నాటకప్రదర్శనము.

    పాటలుపాడుటయందేకాక పద్యములుజదువుట యందు గూడ సంగీతముపయోగింఫవలసినకారణము వేఱొండుకలదు. తెనుంగుభాషయొక్క, ప్రకృతియే స్వరమాధుర్యము. అందు చేతనే సంగీతశాస్త్రము యొక్కయుదాహృతికిదియెంతయో యుపచరింపు చున్నది. అట్టిభాష మనకు మాతృభాషయయ్యు భాషయందలి పద్యములను స్వరనియమములేకుండ జచ్చుగాజదివినయెడల భషాప్రకృతిని ఎంపినవార మగుదుము. ఈరెండుకారణములచేతను దెనుగు పద్యములుచితమగు రాజధోరణిలోనే చదువవలెను. కాని యారాగముమాత్రము పద్యమునంత నాదరించి మంచినేతుగూడదు.
    సంగీతనాధనౌచితియందు నేనెఱిగినంతవఱకు జాల కాలమునుండి నెల్లూరిసామాజలోనగ్రస్థానము ననుండియున్నారు వారుపైజెప్పిన నియమముల బాటింపుచు నాటకప్రదర్శనమును గడు రమణీయముగ జెయుచుండిరి. సంగీతమునందు విద్వాంసులున్నను వారు తమ ప్రాగల్బ్యమును గొంతవఱకు సంతరించుకొని పద్యములందలి భావ ప్రకటనము స్పష్టముగాను బహుమనోహరముగాని జేయుచువచ్చిరి., కాని కృష్ణాగొదావరులయందును, బళ్ళారి ప్రాంతముల యందును, మొన్నమొన్నటి వ

ఱకు సంగీతముయొక్క యార్భాటమే నాటకముల యొక్క ప్రాశస్త్యపు బిరుదుగా యోజింపబడినట్లు గాన్పించుచుండిరి. ఒక్కొక్క పద్యముతో మొదలిపెట్టిన రాగమద్ధానితో ముగియవలసినదే, పద్యము పూర్తియగువఱకు సుమార