పుట:Andhra-Natakamulu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

41

సుఖాంతనాటకములు, దు:ఖాంతనాటకములు.

త్కృష్టాదర్శములను వెదజల్లుటయు, నాంధ్రనాటక తేజస్సును బ్రపంచనాటక ప్రభాపుంజమలో బ్రసరింప జేయునొనరింతురుగాక।!!

5. నా ట క ప్ర ద ర్శ న ము.

శ్లో॥ఆఫరితోషాద్విరుషాం
    నసాధుమన్యే ప్రయోగవిజ్ఞానం।
    బలసదవిశిక్షితానా
    మాత్మన్య ప్రత్యయం చేతన॥

[కాళిదాసు]

  ఆంధ్రనాటకప్రదర్శనము మన తెలుగుదేశములో ననేక ప్రాంతములయందు ననేకరీతులుగా నున్నది. ఒకదిక్కునందున్న ఫక్కీ మఱియెకదిక్కున లెదు. విశాఖపట్టణమువైపు నొకమాదిరియు, దోదావరి, కృష్ణా, గుంటూరు ప్రాంతముల మఱియొక తీరును నెల్లూరుమండలమున నింకొక