పుట:Andhra-Natakamulu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

37

సుఖాంతనాటకములు, దు:ఖాంతనాటకములు.

యున్నది. కాలటేయుడైనను బటాణుడు పితృమరణముగావించి బ్రతికవలసినవాడా? తనయందు సంపూర్ణ విశ్వాసముగల తండ్రిని మతద్వేషముచే గపటోఫాయమున జంపిన శూరుడు, బ్రతికినయెడల నాయకుడగుట కెంతమాత్రమును దగడు. కావున దండ్రినిజంపిన కరవాలముచేదాజచ్చు టయే ధర్మము, అతడు జచ్చినయెడల నాతనికంటె నెక్కుడభిమాన సాహసములుగల ఆషాబీ నిశ్చయముగ వీరస్వర్గము నొందును. ఆలాపన మార్చినిరూపించిన గ్రంధమే యుద్గ్రంధమై యాంధ్ర వాజ్మయ మందుక్షీణప్రకాశముతో నెగడొందుచుండును.

   ఇట్లు జెప్పుటచే విషాదకధలన్నియు విషాదాంత ముగనే కనుబడుటవలయునని నాయభిప్రాయము గాదు. ఏకధ నయినను దు:ఖాంతముగ రచింపవలయునా లేక సుఖాంతముగ రచింపవలయునాయను విషయమును నిర్ణయించుటకా కధ దేశచరిత్రయందుగాని కర్ణాకర్ణికగాధలయందుగాని యేరూపమును దాల్చి యున్నదో ముందు దెలిసికొనవలసి యున్నది. మోదాంతమగు నైతిహ్యముగా గధాసాంప్రదాయము లలో జేరియున్న యెడల దానిని విషాదాంతముగ జేయవలనుపడదు. హరిశ్చంద్రుని గాధ విషాదాంత ముగ జేయవలను పడదు. హరిశ్చంద్రుని గాధ విషాదాంతము చేయు టెట్లు? పరమేశ్వరునిచే లోహితాస్యుడు బ్రతికింప బడెననియు, చంద్రమతి యందు ఖడ్గనిహతి పుష్పమాలాకృతి నొందెననియు బురాణము లుద్ఘోషించుచుండగా మనమెట్లు మార్చగలము? అట్లు మార్చుట యనిచితము నధర్మమునుగాదా?