పుట:Andhra-Natakamulu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
32

ఆంధ్రనాటకములు.

నెనిగురించి చాల నుగ్గడించెను. కరుణభయానక బీభత్సాది రసములు ప్రేక్షకుల యుల్లంబుల నుద్బవించి యట్టి రసోద్రేక పరిచయమువలన వారికి జీవితావస్థలలో నటువంటి యాందోళన భాధ ముందెన్నడును కలుగకుండ జేయగలుగునని యీదు:ఖాంతనాటకములే. మఱియనుత్కటరసా వస్థలు రంగస్థలమందు నైజప్రకృతి ననుకరింపబడగా వారుచూచి యొకవిధమయిన సంతోషముతో తమస్వ జీవితమునందట్టి యవస్థలు కలిగినప్పుడుద్వేలమైన రసాతిశయముబొందక సమస్ధితిని యుండుటయు తటస్థించును. దు:ఖనధనములతో జీవితాశయముల బరిశుభ్రపరచెడు సంవిధానము యితరదేశములకన్న మనదేశమందెక్కువగా వాడుకచేయబడుచున్నది. సామాన్యముగ నేకధ జూచినను గష్టపరంపరలే, ఇన్ని కష్టములననుభవించియుతుదకు దైవహాయముచేత సుఖావాప్తికలిగినట్లు మనమంతముజేయుదుము. ఇతరదేశములలో గష్ట జీవికి కష్టములే పరిణామముగానున్నట్లు కనుపరచెదరు. వారి శ్చంద్రుడవృతము లాడక యెన్నియో కష్టముల నుల ననుభవించి తుదకీశ్వరసహాయ్యమున సుకమునొందెను సావిత్రి శకుంతల కధలు వేరేచెప్ప నక్కరలేదు. నలుడు ద్యూతకారణమున రాజ్యమును భార్యనుగోలుపోయి దైవబలముచే మగుడిసంపాదింప గలిగెను. ఈప్రకార మన్నివిషయములందును దైవబలిమును ముడిపెట్టి కష్టముల దొలగింపచేయుట మనవారికి వాడుకయినది. గాని యీవాడుక యిటీవలివారి మతమై