పుట:Andhra-Natakamulu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

31

సుఖాంతనాటకములు, దు:ఖాంతనాటకములు.

ప్రేక్షకులకద్భుతము గలుగ జేయుచుండును. గ్రంధకర్త స్వాభావికపద్ధతుల మరనముదప్పింపలేనియెడల నొకటో రెండో పద్యములువ్రాసి భగవంతుని దెప్పించును. ఆభగవంతుడా పద్యములను వినగానే సందులోనిండియో గొందిలోనుండియో పరుగునవచ్చును. మృతకళేబరము దిగ్గునలేచును. అందరు చూచి కెవ్వున కేకలువేసి సంతసించెదరు. మృత్యువును దప్పించుటగాని మరణించినవాని బ్రతికించుటగాని యింతసులభసాధ్యమయినచో లోకములో జచ్చినవారే యుండరు. అందరు చిరంజీవులే. కావున ప్రతినాటకము సుఖాంతముగా నుండవలయుననునిర్ణయము కేవల మస్వాభావికము అనుభవవ్యతిరేకము.

   ఆంగ్లేయమహాకవియగు "మిల్టను" ఒకానొకసమ యమున దు:ఖాంతమగు నాటకమునుగురించి ఇట్లు నుడివెను.  "Tragedy, as it was anciently composed, hath been ever held the gravest, moral est and most profitable of all other poems; therefore said by Aristotle to be of power by raising pity and fear or terror to purge the indeed of those and such like passions, that is, to temper and reduce them to just measure with a kind of delight stirred up by reading or seeing those passions well imitated." దు:ఖాంతనాటకమునీత్యుద్భోధకమగు గ్రంధసముదాయములలోమిన్నయుకవనసంచయములొ నత్యుపయోగకరమైనదియుగావుననే ప్రాచీన నియంతయగు ఆరిస్టాటిలుదీ