పుట:Andhra-Natakamulu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
30

ఆంధ్రనాటకములు.

తికి విరుద్ధమేకాక మానవప్రపంచమునందలి యనుభవచ్రిత్రలో నొకసమము భారము మానవ్చనిత్య జీవనమున కుపయోగింపకుండ చేయుటయు గలుగు చున్నది. జాతియందుగాని వ్యక్తియందుగాని కష్టరంపర లు గలుగుచుండుట సర్వసామాన్యముగదా! ఈకష్ట పరంపరలెల్లప్పుడు నెల్లడలను సుఖాంతమగ నుండునా? విపత్తులు కొనివిషయములలో విషాధ మగు మరణమును గలుగజెయుటలేదా? దుష్ప్రవర్త నకు లోనగు మనుజుడు పరిణామమున సుఖము నొందుచున్నాడా? తన దుర్వ్యసనములచేగాని దుష్క ర్మలచేగాని ప్రాణమునుగోలుపోవుటలేదా? దురహంకార పిశాచముచే నావిష్టుడైన రామరాజు రణ రంగమున బ్రాణములువిడువలేదా? శాత్రవులదురాశ లకు బలియై రంగనారాయుడు వీరస్వర్గము గైకొనలేదా? ఈలాగున నేదేశమందైనగాని దైవికముగ నో స్వాభావికముగనో ముప్పువాటిల్లుట యనుభవేద్యమే. అయితే నాటకము జీవిత ప్రపంచమునకు బ్రతిబింబమని చెప్పి యెల్లపుడును వ్యక్తిజీవితము సుఖాంతమగునట్లు నిరూపించుట యధార్ధమునకువిరుద్ధమగుచున్నదని వేఱెజెప్ప వలయునా?

    ఈ సంగతి యంతయు దెలిసియుండియు మనవారానన్నమైన మృత్యువు నెదుర్కొనజాలక కనికరముబూని యేదోవిధముగ మృత్యుదర్శనము దప్పించుకొన బ్రయత్నింతురు. ఆప్రయత్నము లప్పుడప్పుడు చిత్రవిచిత్రగతులొంది