పుట:Andhra-Natakamulu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
20

ఆంధ్రనాటకములు.

నిని నిల్చుటకు మహానుభావులె మానవ చరిత్రలను రూపకములు, వ్రాయుట యుత్తమము. ప్రేక్షకులన్ననో యీ మానవ ప్రపంచములో బుట్టిపెరిగి గిట్టిన తమ తోదివారలా పాత్రములచే నలరారు నాటకములు జూచి తమదను భావ వికారము లాయా పాత్రముల యందుండుటచే తమ్ము దామే యంతర్ముఖులై చూచుకొందురు. ఆహెతువువలన దమమానస ములను గొంతవఱకు బరిశోదించుకొని దిద్దుకొనగలరు. నాటకములయొక్క ముఖ్యోద్దేశ మిందుమూలమున దప్పక నెరవేఱును.

    కావున నాయాశయ మెమన:-- మనము నివసించియున్న యీచరాచరయుక్తమగు ప్రపంచమును నిజముగ వర్ణించి మన దేశీయ్లుల కన్నులకు గట్టినటుల ప్రకృతిని బ్రదర్శించుట ముఖ్యావ  సరముము. అట్లు చేయుటలో గూద జనసామాన్యము యొక్క యూహశక్తుల పరిమితిని గూద జూడవలయు. వారి యూహకు మించిన ప్రయోగములు నిరుపయోగములు, కాబట్టి మన యాంద్రదేశచరిత్రను బరిశోధించి గాని మన ప్రాక్ఖండ చరిత్రలను బరిశోధించికాని మన భారతదేశ చరిత్రను బరిశోధించికొని వ్రాసిన నాటకములు మనదేశీయు లకు నూహ్యములై గ్ర్రహ్యములై రుచి బుట్టించి వారి యొక్క బుద్ధి వృద్ధులకు దోడ్పడి వారియందు నాగరికతయును మానసొన్మీలనమును బెంపొందింప జేయగలవు. ఈ పద్దతు లిటీవల గొంతవఱ కాచరనలోనికి వచ్చుచున్నవని