పుట:Andhra-Natakamulu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
14

ఆంధ్రనాటకములు.

యు నాంగ్లనాటకముల యొక్కయు పోలిక లిప్పటివఱకు మన నాతకముల బొందింపబడియే యున్నవి.

  ఆంధ్రనాటక చరిత్ర వ్రాయునపుడు నాంధ్ర నాటకముల యుత్పత్తి విషల్యములో బళ్లారినందు రాజమహేంద్రవరమును నగ్రస్థానములు బొంది యున్నవని చెప్పవలసి యుండును. ఈ రెండు స్థలములలోను గొంచె మెచ్చుతక్కువగా సంకాలమందుననే నాటకరచనా ప్రయత్నమ్లు జరిగినవని చరిత్రాన్వేషమున దెలియుచున్నది. అయినను రచనా పద్దతులు మాత్ర మీ రెఒటినందును వేర్వేరయ్యను. బళ్లారియందలి మహానాటక నిర్మాతలగు కృష్ణమాచార్యుల వారును శ్రీనివాసరావు గారును దమ నాటకముల జాల వఱకు బ్రబంధశైలిని వ్రాసియుండిరి. బద్యములవలెనే సంభాషణలు వర్ణనలు గూడ సంస్కృతపద భూయిష్టములైన దీర్ఘసమాసములతో నిండియున్నవి. మధ్యంధ్య పొడవైన రగడలు దండకములు నిత్యాదిబ్రబంధ సూచకములగు కవిత్వ్గధోరణులు యధేచ్చముగా బ్రయోగించియున్నారు. కావున నా నాటకములు యధారూపముగా రంగస్థలమందు బ్రయోగించుట కష్టమగుటయేగాక సామాన్యజనులకు సూక్ష్మముగా గ్రహించుటయు గూద నసాధ్యమే. ఈకొఱత దీర్చుటకో యన రాజమహేందవరమునం దుప్నన్నమైన నాటకములు బ్రధమమునుండియు జనసామాన్యమున కతీతము గానుండెడు సులభశైలిని వ్రాయబడియుండెను. ఇట్టి రచనయందు