పుట:Andhra-Natakamulu.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


10

ఆంద్రనాటకములు.

శము, రాజు మాట్లాడెడిభాష సేవకుడు మాట్లాడగూడదు. సేవకుడుమాట్లాడెడుభాష రాజు మా'ట్లాడకూడదు. ఎవరిస్థితికి దగినభాష వారుమాట్లాడుట యుచితము. ఈవిషయమునందు దేశభేదములకును భాషాభేదములకును తావులేదు. మన తెలుగురాజు మాట్లాడినను, తురకరాజు మాట్లాడినను ఇంగ్లీషురాజు మాట్లాడినను, ఈజిప్టురాజు మాట్లాడినను, శైలి యొకేవిధముగ నుండవలెను. శబ్ద గౌరవ్ము, భావగాంభీర్యము, ఉచ్చారణ నిష్పత్తి ఇత్యాది, మహాపురుష మానసిక లక్షణము లేకసుఖంబుగా వర్తిలవలయును. అలాగునే మనదేశపుసేవకులు మాట్లాడినను. రష్యాదేశసేవకుడు మాట్లాడినను ఒకటే విధమగు శైలినియుండవలయును. గ్రామ్యందము లెక్కుడుగానుండుటయు, ఉచ్చారణయందు దోషముల ను, మున్నగు నీచపాత్రోచితాభావములు నైసర్గికములు ఈరీతిగనే యితర పాత్రలగురించియు నిర్ణయించుట సమంజసము. మహాకవుల కృతులీ నియమముల నతిక్రమింపలేదు. ఇంగ్లీషు వాజ్మయ మందలి తామర్లేను, ఔరంగజేబు నాటకముల జర్మను భాషయు దలి "టాసో" పైడు, ఆఫ్ ఆర్లిన్సు మున్నగు నాటకరాజము లీలాగు వ్రాయబడినవి.

  ఇంతవరకు భాషావిషయములగూర్చియే వక్కాణించి తిని, మానసిక హృదయిక, గుణంబు లసంఖ్యాకంబులును, ఏకైకభిన్నంబులు నగు ఆదర్శములు, అభిప్రాయ