పుట:Andhra-Natakamulu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

9

నాటకతత్వము.

యందు గొందఱయినను సుశిక్షితులు కానియెడల వారు మిశ్రమమగు తెలుగు మాత్రమే మాట్లాడుట కర్హు లని తేలుచున్నది. అయితే మన యాంధ్రదేశమం దునికి కెన్నడు నవకాశములేని యితరజాతులవారి విషయములో నెమిజేయదగియున్నదియు తెలియ రాకున్నది. గ్రీసుదేశపుకధలను, రోము దేశపు కధలను అమెరికాదేశపుకధలను ఇత్యాది యితరదేశపు కధలను మనము నాటకములుగా వ్రాయవలసినచో ఆయా పాత్రముల కెట్టిభాష నియ్యవలెను? ఆజాతులవారు మనదేశములో నెప్పుడయిన నున్నదియు, వారెట్లు తెలుగు మాట్లాడి నదియు మనకెంతమాత్రము తెలియదే? ఇంక కొన్ని జాతులవారు మన దేశము నెన్నడును చూచుటయు ను లేదే" ఇట్టిజాతులవారు మన రంగస్థలముల యందేభాష మాట్లాడవలెనో యెట్లు మాట్లాడవలెనో తెలియరాకున్నది. కావున నీపండితులు కనుపర్చిన హెతువులను వీరు చేసిన సిద్ధాంతములను మనము సరకుచేసిన యెడల మననాటకములు కేవల మసందర్బములకును హాస్యములకును ఆభావములమును ఆస్పదములగును.

   కాని యీవిషయములో మనకర్తవ్యమెద్ది? దీనిని గురించి నాయభిప్రాయము నిక్కడ చెప్పుచున్నాను. ఏజాతి వారయ్యును, ఏభాషవారయ్యును, తెలుగు నాటకములలో ప్రదర్శింపబడువారుగలన తెలుగుభాషనే మాట్లాడుతూ వారి వారి గౌరవమునకు దగునట్లుగా మాట్లాడుటయే ప్రధానం