పుట:Andhra-Natakamulu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
8

ఆంధ్రనాటకములు.

తోగూడ తురకలఫాత్రములు ధరించెడు వారిచే మాట్లా డించుట స్వభాచ్వసిధ్దమని వారియభిప్రాయము, అలాగున ఆంగ్లేయులు తెలుగు మాట్లాడునప్పుడు యెటువంతి పారిభాషికములను, అపభ్రంసముల నాభాచ్వములను నుచ్చరించెదరో వానిని జాగ్రత్తగా సేకరించి, యావిధమైన యాంధ్రభషను రంగస్థలముల యందు మాట్లాడించుటయే యుక్తమని వీరిమతము. ఈలాగుననె ఫ్రెంచివారును, జర్మనులును, జపానువారును, పాత్రములగునప్పు సమష్టింపవలయును.

  ఈవిషయమును గూర్చి మరియెకరు వ్రాసిన యభి ప్రాయ మేదన-కొన్ని ప్రాంతములలో నున్నతురకలు స్వచ్చమయిన యుచ్చారణతొ వ్యాకరణయుక్త మగు తెలుగు మాట్లాడుట యున్నది గాన, తురకలు రంగ స్థలమునందు శుద్ధమయిన తెలుగు మాట్లాడుట కర్హులు. ఆఉలనె కొంతమంది యింగ్లీషువారు శుద్ధమయిన తెలుగు నేర్చుకొని బ్రౌనుదొర గారివలె తెలుగునందుకవిత్వము చెప్పుటకును సమర్ధులుగా నున్నారు. గాన ఇంగ్లీషు వారునుగూద శుద్ధమైన తెలుగును మాట్లాడుట కర్హులు. అనగా నీపండితుల యభిప్రాయ మిట్టిదని తోచుచున్నది. ఇతరదేశస్థులు మనదేశములో  నివసించి తెలుగు మాట్లాడుటయం దలవాటు చేసికొని, పయిగా తెలుగువారివలె సరియయిన యుచ్చారణము, వ్యాకరణనియమములను పాటించిన యెడల వారు రంగస్ధలములందు మంచి తెలుగు మాట్లాడుట కర్హులు. వ్యాకరణోచ్చారణాదుల