పుట:Andhra-Natakamulu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
6

ఆంధ్రనాటకములు.

మున్నగు స్థలములయందు వచనశైలియే నుండదగిన దని తోచుచున్నయది.

   సంస్కృత భాషయందు దప్ప దదితరభాషలియందు అనగా, లాటిన్, గ్రీక్, ఫ్రెంచి, జర్మను, మొదలగు భాషలయందు రచింపబడిన నాటకములలో స్త్రీలు సహితము పద్యశైలినే మాట్లాడ గూడదని విచిత్ర నియమము విధింపబడుట పరిశోధనీయమయిన సంగతి యయినను ప్రస్తుతాంశము కాదు కావున విపులవిచారణచేయక విడువబదినది.
           నాటకములయందు పురుషులును స్త్రీలును    సమానప్రాముఖ్యనకు బాత్రము లగుపాత్రములే, నాయకుడెంతమాననీయుడో నాయికయు నంతమాననీయురాలనియే నా నమ్మకము. తపోత్కర్షమునకును ఆదర్శసూచనకు ను నాయకునివేషభాషావర్తనము లెంతముఖ్య;ములో నాయికయొక్కయు వేష భాషా వర్తనము లంతముఖ్యములే నాయకుని పాత్రపోషణ మెంత్యకర్తవ్యమో నాయికయొక్కయుపాత్రపోషణ మంత కర్తవ్యమె. అట్టితఱి రసోద్రేకమయ మగు కవితామధురిమ నాయకునకేకాని నాయిక, కనావశ్య కమని చెప్పుట కేవల మన్యాయము, ఉభయుల ముఖముల యందును, గాన విలసిత హృద్య పద్య ప్రవచన దమత్కృతి సమానముగా దాండవము చేయనొప్ప.