పుట:Andhra-Natakamulu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
2

ఆంధ్రనాటకములు.

గూర్చి నేనును నాకు, చోచిన సంగతుల నిక్కడ పొందు పఱచెద.

   మానవజీవితాదర్శములు మానవకొటికి స్వభావ సిద్ధముగను సోదాహరణముగను గనబఱచిమానన చిత్తప్రవృత్తులను శుద్దిపఱచుటయే నాటకముల ముఖ్యోద్దేశము. ఇతిహాస పురాణాదుల నుండికాని, చరిత్రములనుండికాని, భూతభవిష్యద్వర్తమాన సాంఘిక బృందములనుండికాని కవికల్పనలనుండి కాని మహనీయుల చరిత్రములను నిరూపించి తత్తద్వ్యానారేతివవృత్తములను మనకన్నులయెదుట నడపించి మన మనస్సులను రసభరితములుగ జేసి శుద్ధమము జీవితాదర్శములను దెలుపుటయే నాటకముల ముఖ్యోద్దేశము. మానవజీవచరిత్రములే నాటకములకు ముఖ్యాధారము లయ్యును నాటక ములు కేవలము మానవ జీవచరిత్రములు కావు. జీవ చరిత్రములలో నాయావ్యక్తులు వారివారి జీవితముల యందు జన్మప్రభృతి మరణపర్యంతము చేసినకార్యములము కాలానుక్రమముగా రచింప బడును. గ్రంధకర్త యెంతమాత్ర మాకార్యక్రమమును మార్చుటకు వీలు లేదు. నాటకములన్ననో యాద ర్శప్రధానమ్లు గావున గార్యక్రమము నొకింత మార్చి నను మార్చవచ్చును. నూతనపాత్రములను జేర్పినను జేర్చవచ్చును. లక్ష్యముగా జేసికొనిన యాదర్శములను నిరూపించుటయే ప్రధమకర్త్యము.