పుట:Andhra-Natakamulu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

10

కోరలేముగదా ఉదారభావములు వచనరూపకముగను గూడ తెలుపవచ్చును.

సంస్కృతములోనున్న తక్కిన ప్రాచీన భాషలలోనే దు:ఖాంతనాటకములు ఎక్కువ కలవు. కావలసినన్ని ఘోరవిపత్తులను మన మీప్రపంచము కనుచు అనుభ వించుచున్నాముగదా. వీనివలన మనకు సౌహార్దకనితాశాస్థ్యబివృద్ది కాదా, తిరిగి దృశ్యకవ్యప్రపంచమును గూద ఇట్టి సంతాప కారణంబు లను గన మనమేల అపేక్షింపవలయును.? భాషా విషయమున ఇట్టి దురంతర్భతాతములకు ప్రవక్త లేక పొలేదు. చరిత్రకావ్యము నవల మున్నగు శ్రవ్యకావ్యములు వీనికి జాలును. దృశ్యకవ్యములచే ఈ వైపరీత్యములను ప్రత్యక్షపఱుచుట మేలా? సుఖాంత నాటకములు హృష్టియు, పుష్టియు, తుష్టియు నొసంగును. ఇట్టిభావములు అచ్చటచ్చటా వినబడును.

   శ్రీ అచ్యుతరావుపంతులుగారు ఆంధ్ర దేశము నందలి ముఖ్యరంగస్థలములను లెస్సగ పరిశీలించి యున్నారు. ఆంగ్లమునను ఆంధ్రసంస్కృతములను వీరు ఉత్తీర్ణులు, వీరి ఆశయములు ఆదరణీయములు.
 ఇట్టి విమర్శనగ్రంధములు వీరు ఎక్కువగ ప్రకటించి ఆంధ్రమునకు ఆంధ్రులకును మేలొనరించిన సమర్ధులు.
విజయనగరము 14 మే 1926

గ. సొమన్న