పుట:Andhra-Natakamulu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8

పరంపరను వీరు స్వబుద్ధితోడనే నాటకతత్త్వమును తరించి ప్రకటించినను నాట్యాచార్య సిద్ధాంతములతొ బెక్కువిషయముల నేకీభవించుట వీరిప్రతిభకు మెఱుగు తెచ్చుచున్నదని యట్టి ముఖ్యాంశముల నిందు బేర్కొంటిని.

   ఈ పూర్వవిజ్ఞప్తి నన్ను రచింపు మని పరశులవారు నన్ను గోరుట వారికి నాయందు గల మైత్రిప్రతిపత్తి సాక్షిభూత మగుచున్నదని నాయంతరాత్మ యానందించినను దీనిలో నున్న గుణముల నించుక స్పృశించి చూపుట తదానంద జన్యము కాక కేవలము నాట్యశాస్త్రపరిశీలన క్లిశ్యమాన ప్రతిభాలనవిశ్రాతికారణ మనియే నత్యోక్తి గ్రహింతుగాక యని పండితుల బ్రార్ధించుచున్నాడను.
రాజమహేంద్రవరము 24 జూన్ నెల 1926

మా. రామకృష్ణకవి

                           =====

పం డి తా భి ప్రా య ము లు.

                  ---00--

విద్వాన్ గరిమెళ్ల సోమన్నపంతులు ఎం.ఎ.ఎల్.టి.గారు

    "శ్రీ టేకుమళ్ళ అచ్యుతరావుపంతులు ఎం.ఎ.ఎల్.టి. గారు రచించిన యీ ఆంధ్రనాటకములు అను విమర్శనగ్రంధమునందు నాటకముల ప్రయోజనములను ప్రదర్శన పద్ధతు లను ఇప్పటి తెలుగునాటకముల గుణదోషములును పదిలముగ వివేకముతొడను చర్చింపబదినవి. నాటకములు వ్రాయువారును నాటకముల నాడు వారును నాటకములను