పుట:Andhra-Natakamulu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6

నమానుషస్వభావవర్ణనములకు లోకాభిప్రాయ ప్రనాహసిద్ధమగు రూపమునే గ్రహింపవలయు నని మునిమతమే ప్రతిపాదించిరి. ప్రసంగవశముగా నాటకములు సభాసదులయాత్మ సంస్కారమున కనుగుణముగా నుండవలయు నని, శాసించిరి. ఇది చాలా జటిలప్రశ్నము. లోకము భిన్నరుచుక మగుటచే గధారుచి కనుగుణముగా నధికారసంపత్తి గల సామాజి కులే చూడవత్తురు. నాటకసుఖసిద్దికి గేవలము కవి, నట, గాయక, నాదక, జననికాసామగ్రులే కాక సభ్యుల సంస్కారపటిమయు దోడ్పడు ననువిచారమునకు దొడగుటలో నేటికాలపు విమర్శకులలో వీరే ప్రధము లగురేమో.

     శీలప్రతిష్ఠాపన మను మూడవవిచారము చాల సుందరముగా సంఘటింపబడియె. నీరసములు నురుపయోగములు. నిమ్నపాతనములు నగు వస్తు శరీరముల బరిగ్రేహింపక యుదాత్తగుణసౌందర్య వ్యక్తీకరణమే మానవాంత:కరణ మాలిన్యము దొలగించి ధర్మాదిసాధనోపాయ మగుచు గృతార్ధతా పరిగ్రాహక మగు నని వీరు ప్రతిపాదించిరి. అవాంతర ప్రసంగముగా బాత్రగుణముల నూరక పేర్కొన్నం జాలదని భరతాదులు ప్రకారాంతరమున జతుర్విధా భినయసాధనము లని పేర్కొన్న భావభావనారూప మగు పాత్రగుణ వ్యక్తీకరణము శ్రేష్ఠమని సిద్దాంతము చేసిరి. పురాణగాధల గ్రహించినమాలోకప్రవా హసంసిద్ధమగు గుణౌచిత్యమునే పోషింపవలయు నని ప్రతిపాదించుటయు మర్షుల యాశయమే.