పుట:Andhra-Natakamulu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రం ధ ప్ర స్తా వ న.

              ----00----
    నాటకలక్షణప్రతిపాదక మగునీచిన్నగ్రంధము పింగళి సూరనాదికవికావ్యవిమర్శన ప్రఖ్యాతులై యాంధ్రలోకమున జిరపరిచితులును విశేషించి మాకు జిరకాలమిత్రులు నగు బ్రహ్మశ్రీ టేకుమళ్ళ అచ్యుతరావు పంతులు ఎం.ఏ.ఏల్.ట్., గారు రచించి బహుపత్రికాముఖముల ననుదినము వెలువడు నాటకతత్త్వప్రకటనములలో గలవివాదగ్రంధుల జాలవఱకు భంజించి సహృదయలోకమునకు సమర్ఫించుట యెల్లర కామోదకరము. ఆంధ్రభాషలో నాటకలక్షణగ్రంధములు లేకుండుటయు, సంస్కృతములో భరతాదిమహామతుల యాశయములు సంపూర్ణముగా నేభాషలోగాని ముద్రణావస్థకు రాకుండుటయు గొన్నిశతాబ్ధాలుగా భరతఖండమున నాటకప్రదర్శనవిద్య శాస్త్రసమ్మతము గా గాక యధాదేశ కాలసౌందర్యముతో నగతికశరణ్యముగా  విలసిల్లుచున్నను దెనుగుభాషలో నదియు గానరాక ఖండాంతరవాసుల పరిచయదోషముచే దద్గ్రంధ ప్రణాలికల ననుసరించి యనుదినము ప్రభవిల్లుచున్న నాటకసముదాయ మక్కడక్కడ క్లేశభూయిష్టమగుచు మనస్విజనములకు హృదయ సంవాదమును సమగ్రముగా గలిగింపనేరక విషమ సమసొయ్ఃత్పాతములకు జన్మభూమి యగుచుండు టవలన గవికర్మముననో నటకౌశలముననో లేక