గీ. | ఒడ్డగిలెనాఁగ నొకదిక్కు కొరిగెననుట, యెనఁగు బెండగిలెనునాఁగ నెత్తువడియె | 95 |
గీ. | ఓసరిలెఁ దగ్గె తఱిగెనా నొప్పుఁ దక్కు, వాయె ననుమాట కలచెనా నలరు వలచె | 96 |
సీ. | ఓహటించె ననంగ నోడె నంచును దోఁచుఁ గూఁకె నాఁ గనుపట్టుఁ గ్రుంకెననుట | 97 |
గీ. | డాఁగురించె మఱిఁగె డాఁగె ననంగను, దాఁగి యుండె ననుట గాఁగఁ దోఁచుఁ | 98 |
సీ. | చేకుఱెఁ జేకూఱెఁ జేకూడె నంచన నేకార్థములు గాఁగ నెసఁగుచుండు | 99 |
గీ. | డిల్లపడె ననంగఁ జెల్లును ధృతివీడె, ననుట జాగుచేసె ననుట కొప్పు | 100 |
సీ. | ఆశ్చర్యమును జెందె ననుమాట కర్థమై తటకాపడె ననంగఁ దనరుచుండు | 101 |
గీ. | వగచె దురసిల్లె వందురెఁ బల్లటిల్లెఁ, బొక్కె నన నంగలార్చెనాఁ బొల్చియుండుఁ | 102 |
గీ. | బీరువోయె ననంగను మీఱు వ్యర్థ, మాయె ననుటయు మెల్లనపోయె ననుట | 103 |