పుట:Andhra-Bhasharanavamu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

మూఁపురమంచనఁ నూఁపురమంచనఁ గకుదభిధానమై క్రాలుచుండు
గంగడో లనఁగను గనుపట్టు సాస్నాఖ్యశృంగంబు కొమ్మనఁ జెలఁగుచుండు
దూడనాఁ గ్రేపునాఁ దోఁచును వత్సంబు దనరు లేఁగ యనంగఁ దర్ణకంబు
గిత్తనా గిబ్బనాఁ గెరలు నార్షభ్యము వెలయుఁ గోడె యనంగఁ బెయ్య యనఁగ
గోప్రభృతిపుంస్త్ర్యపత్యము ల్గోవు కుఱ్ఱి యావునాఁగను జిత్రగవాఖ్యలందుఁ
జెమటియా వనునట్టుల నమరియుండు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

262


సీ.

గొడ్డన వంజనా గొంజనా వంధ్యయౌఁ బొదలును సంధిని వెద మొద వన
నీచుకొనినదినా నెసఁగును నపతోక గేరు వామనగని గిడ్డి యనఁగఁ
జనుఁ జతుర్హాయనసంజ్ఞ పడ్డ యనంగఁ దఱుపు నాఁగను వత్సతరి దనర్చుఁ
బ్రథమగర్భిణిపేరు పరఁగును మొదవన గర్భిణి చెలువందుఁ గట్టిన దన
నమరు బష్కయణి తఱపియా వనంగఁ జెలఁగు మజ్జిరి యనఁగ నైచికిసమాఖ్య
పొదుగునాగను నూధస్సు పొలుచుచుండు నెమరునాఁగను రోమంధ మమరు నభవ.

263


సీ.

చనును గర్భస్రావసంజ్ఞ కట్టుకయనఁ బొల్చు బీజావాపము వెద యనఁగ
నీనికయంచన నీఁతయనంగను బశ్వాదికప్రసవంబు చెలఁగు
నెను పసరం బన నెనుమన నెనుపెంటి యన బఱ్ఱెనాఁగను దనరు మహిషి
వామనమహిషియై వఱలు గేదె యనంగ మహిషవాచకముగా మనుచునుండు
దున్న యన నెనుపోతన దుంత యనఁగఁ గీలకము పేరు లంకెనాఁ గేరుచుండు
దామెన యనంగ దామని దనరుఁ గవ్వ మనఃగ మంథాననామమౌ నజ్జమౌళి.

264


సీ.

తరికంబ మనఁగను దనరును గుటరమ్ము తరుచుట చిలుకుట త్రచ్చుట యన
మథనాభిధానంబు మను నొంటె యనఁగను లొట్టియు యనఁగను లొట్టెనాఁగ
లొటిపిట యనఁగను లొటిపిట్ట యనఁగను లొట్టిపిట్ట యనఁ గన్పట్టు నుష్ట్ర
మలరును లొట్టేనుఁగన మహోష్ట్రాభిధ మేఁక చుచ్చును జింబు మీఱు ఛాగి
భాగనామంబు జింబోతునాఁగఁ దనరు గొఱ్ఱె గొఱ్ఱియ యనఁగను గొఱలు మేషి
తగరు పొట్టే లనంగను దనరు మేష మాశ్రితవృషార్వ మాతృభూతాఖ్యశర్వ.

265


సీ.

గాడిద యంచన గర్దభనామమౌ గోనెయం చనఁగను గోణి పరఁగుఁ
దద్విశేషాభిధ తగును బరకమనఁ జను నలగోణాఖ్య సలక యనఁగ
నత్యల్పగోణియై యలరు విత్తయనంగ నసిమి గోతము సంచి యనఁగ నల్ప
గోణివిశేషముల్ గొఱలు వంచె యనంగ నట్టెడ యంచన నాఢకమిత
గోణి తగు ధాన్యపూరితగోణికాఖ్య యగుచు బెరికనఁ బెడక నా మలఁగ యనిన
ధాన్యనిరహితగోణిగాఁ దనరుచుండు నంకెమండె మనఁజను గోణ్యర్థ మభవ.

266