పుట:Andhra-Bhasharanavamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

భక్ష్యసామాన్యంబు పరఁగును బిండివంట లనంగ నన్నంబు వెలయుచుండు
బువ్వ యోమటి కూడు బోనము వంటకం బోరె మోగిరమునా నొప్పుచుండుఁ
గలవంటకం బనఁగాను మిశ్రాన్నంబు చలిదినా శీతాన్నసంజ్ఞ దనరు
బాంచాళి కాకేళిపక్వాన్న నామంబు గుజ్జనగూడన గొఱలుచుండుఁ
జిమిడిక యనంగ లగడునాఁ జెలఁగుచుండు నధికపక్వాన్న మలరు మాఁడనఁగఁ దగ్ధి
కాహ్వయము మెదుకన సిద్ధకమ్ము మీఱు నెండుమెదుకులు పక్కునా నెసఁగు నభవ.

257


సీ.

తైలాభిధానంబు దనరు నూనె యనంగ నేరండతైలంబు మీఱు నాము
దం బనఁ బేఁడనా దనరు గోమయసంజ్ఞ పిడక నాఁ దనరుఁ దత్పిష్టకంబు
వెలయుఁ గరీష మేర్పిడక పరంటనాఁ దచ్చూర్ణ మెరువుగాఁ దనరుచుండుఁ
బాడియం చనఁగను బరఁగుఁ బయస్యంబు పోసనాల్ పాలునాఁ బొల్చు బహుత
క్షీర మగు గుమ్మ యనఁగఁ దద్ధార వెలయు నానవా లనఁ జిఱువాలునా నెసంగుఁ
గర్దమీకృతదుగ్ధంబు క్రాలు ముఱ్ఱు నాఁగఁ బీయూషనామంబు నాగభూష.

258


సీ.

మీఁగడ యంచన మీఱు మండాభిధ నవనీతసంజ్ఞ వెన్న యన వెలయు
నెయ్యి యంచనఁగను నివ్వటిల్లు ఘృతంబు చమురు మెఱుఁగన స్నేహము దనర్చుఁ
దనరును బక్వఘృతంబు తెలి యనంగ గసినా ఘృతాదికల్కంబు దనరు
నాతంచనాఖ్య యై యలరుఁ జేమిరి యనఁ బెరుఁ గన దధి పేరు పరఁగుచుండుఁ
గుంపెరుఁగు నాఁగ ద్రప్సమగుం గల పనఁ మిశ్రదధి యొప్పుఁ గానన మీఱు మథిత
మడరు దండాహతము చల్ల యనఁగ మజ్జిగ యనఁ దోడనఁ దగు దధీకరణ మభవ.

259


సీ.

ఆఁకలి యన గొద యనఁగ నాకొంట నాఁ గను క్షుత్తుపేర గాఁ దనరుచుండు
నన్నాదివిన్యాస మలరు వడ్డన యనఁ గమి యనఁగా నొప్పుఁ గబళసంబు
కబళంబు కడి యనఁగాఁ జను గవణమం చన గజాదిగ్రాస మమరుచుండుఁ
బిడచ ముద్ద యనంగఁ బిండంబు వెలయును డప్పి నీర్వట్టు దప్పి దూప
యన జనుఁ బిపాస మెసపుట యారగింత యారగింపు కుడుపు నాఁగ నలరు భుక్తి
దనరు నాభుక్తి యాబూతి యనఁగఁ దనుపు తనివి యాపోవుటనఁ దృప్తి దగు మహేశ.

260


సీ.

ఎంగిలినాఁగఁ జెలంగు నుచ్ఛిష్టంబు గోపాలకుం డొప్ప గొల్లవాఁడు
గొల్లఁడు కీలారి గొల్లకిలారి పసులగాపరి యనంగఁ జెలఁగుచుండు
గోమహిష్యాదుల నామము ల్పసి తొఱ్ఱు తొడుకు పసరమునా నడరు గోకు
లమ్ము మంద యనఁ గిలారమ్మునా గాశితము పట్టు పెంటనాఁ దనరుచుండు
నె దందనంగను వృషభాఖ్య యెసఁగుచుండు వెలయు గంగెద్దునా దేవవృషభసంజ్ఞ
బసవఁ డాబోతనంగ గోపతి దనర్చు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

261