పుట:Andhra-Bhasharanavamu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

నిమ్నభాండాభిధ నెగడు లోవి యనంగ నతభాండసంజ్ఞ గూనయనఁ బరఁగు
దుత్త యనంగను దుగ్ధభాండం బొప్పుఁ దగు గళంతిక కలంత గరిగ యనఁగఁ
బ్రతలాల్పభాండంబు పరఁగుఁ జట్టి యటిక యన ముష్టిమానభాండాఖ్య పిడుత
యనఁ దనరారు నత్యల్పభాండం బొప్పు గురిగయం చనఁగను గురి యనంగ
లడ్డిగ యనంగ వేణుపాత్రంబు చెలఁగు గొట్ట మనఁ దద్విశేషంబు కొఱలుచుండు
దీపపాత్రంబు బ్రమిదనాఁ దేజరిల్లు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

247


సీ.

సిబ్బిమూఁకు డనంగఁ జెలఁగు శరావంబు పరఁగు దడ్డెము సావ బట్లె మల్ల
యననగుఁ దద్విశేషాభిధ శాకంబు కూర యనంగను మీఱుచుండుఁ
జూర్ణ శాకాభిధ శోభిల్లు దుగ్గునాఁ బప్పుబేడ యన సూపంబు దనరు
నుపదంశసంజ్ఞ యై యొప్పుఁ బచ్చడి యన శాకనాళము పేరు జరును గమ్మ
కాను కాఁ డనఁ దింత్రిణీకంబు చింత పం డనంగ వెలయును సంబా రనంగ
వేశవారంబు దనరును వెలయు మిరియ మన మరీచాఖ్య పార్వతీప్రాణనాథ.

248


సీ.

ఇంగు వనంగను హింగువు పసుపు బందారు నాఁగను హరిద్ర చను సోపు
నల్లజీలకఱనాఁ జెల్లును సుషవిక మెంతి యనంగను మేంధి యొప్పు
వార్ద్రకంబు చెలంగు సల్ల మనంగను గుస్తుంభరి దనర్చుఁ గొతిమిరి యన
సొంటి యనంగను శుంఠియౌ లవణాఖ్య యుప్పునా వెలయు నిందు ప్పనంగ
నడరు సైంధవలవణము నౌ బిడాల లవణ మంటుప్పు చౌటు ప్పన విలసిల్లు
నొగి సురక్షార మగును బెట్లుప్పనన్సు రుప్పనంగఁ గళాభాసితోత్తమాంగ.

249


సీ.

తండులక్షాళనోదకము రాజిల్లును గుడితి యనంగను గడు గనంగఁ
గూరాడు కలినాఁగ మీఱు ధాన్యామ్లము వఱలు నన్నరసంబు వార్పు గంజి
యనఁగాను గౌబేర మలరు నంబలి యనఁ విలసిల్లును విలేపి వెలవ యనఁగ
నిస్స్రావసంజ్ఞ యై నెగడు జావ యనంగ నుష్ణిక కాఁడినా నొప్పుచుండు
నటకలి యనంగ జెలఁగు నభ్యంగతైలహారకద్రవ్యసంజ్ఞ మెట్టనఁగ మెడుద
నంగఁ బులిమెట్టనంగఁ జెలంగుచుండు నభిషుతాఖ్య నగాత్మజాప్రాప్తసఖ్య.

250


సీ.

మీఱు యూషము కట్టు చారు పణిద మనఁ బాగనఁగా గుడపాక మెసఁగుఁ
గండచక్కెరయనఁ గనుపట్టు మత్స్యంది గుడము బెల్లము బెరకడ మనఁదగు
శర్కరాహ్వయములు చక్కెర యనఁగను బంచదార యనంగఁ బరఁగుచుండు
శర్కరాభేదసంజ్ఞలు నవాతు జుమోజు పులకండ మనఁగను బొలుపుగాంచు
సిగర యనఁగను శిఖరిణి చెలఁగు నూరుబిండన లవణభావితపిష్ట మొప్పుఁ
బులుప యులు పన విరళామ్లకలితపిష్ట మొనరుఁ దిమ్మన మనఁగ దేమన మగు భవ.

251