పుట:Andhra-Bhasharanavamu.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రభాషార్ణవము

6


తే.దక్షిణామూర్తిసేవవిచక్షణుండు, సంతతా ద్విైతవేదాంతసక్తచిత్తుఁ
డతఁడు తద్గర్భజలథిహి మాంశుఁ డీవు, రాయరఘునాధనృపచంద్ర రణమృ.

ఉ.శ్రిరఘునాధరాయనృపశేఖర నీదుకరాసి భీమకా
ళోరగతుల్య మాటను రణోర్విని దుర్మదమత్తచిత్తులౌ
వీరులప్రాణవాయువులు పీల్చుట యుక్త మిదెంతవింత య
య్యారే సముద్రమయ్యును రవంతయు భంగముఁ గాంచ దెప్పుడున్.

చ.కడెములు బహుపుర్లు పతకంబులు పోఁగులజోడు లుంగరా
లడుగఁగ వచ్చు భూషణము లౌటఁ దదంగము లిమ్మటంచుఁ గొ
రెడిభవదీయసాయక మరిప్రతతిన్ ఘనమర్గ ణానలి కిీ
నడతలు యుక్త మౌనె రఘునాధమహీపదిలీప విక్రమా.

ఉ.శ్రిరమణీమణీచరణశింజసమంజసరత్నపుంజమం
జీరనినాధవద్గృవిశేషుడ వౌచు సపుత్రపౌత్రతన్
ధారుణి నేలు సౌభరివిధమ్మున సర్వమహీపతు ల్నినున్
సారెకుఁ గొల్చు లీల రఘునాధనృపాల విశాలవైభవా.

మ.హృదయావాలముచక్కి భక్తిరసవారిన్ జ్ఞానబీజంబులో
నుదయంబంది ప్రరూఢపాద మగుచున్ గోకర్ణనాథాభిధ
త్రిదశానోకహసంగతిన్ దనరుచున్ శ్రిమద్బృహ న్నాయికా
ఖ్యఁ దగున్ గల్పకవల్లి రాయరఘునాథాదీశునిం బ్రోవుతన్.

ప.అని తలంచి నాకర్యంబు నాశీర్వాద పూర్వకంబుగా నెరవేర్చి మహారాజాజ్న ప్రకారంబున.

షష్ట్యంతములు

క.శ్రీపతిముఖనిఖిలశుభ, ప్రాపకసంభాషునకు వరాంతర్లోక
క్ష్మాపమదాటోపకధా, లాపభిదారో షునకుఁ గళాభూషునకున్.

క.శరణాగతహృదయతమ, స్తరణికి సంసారజలధితరణికి దైత్యో
త్కరశిక్షణసురరక్షణ, కరవీక్షణ ఘృణికిఁ జంద్రి కాన మఘృణికిన్.

క. శ్రిమత్సుగంధికబరీ, కామికిని మునీంద్రహృదయ గామికిని క్షమా
భూమికిని మాతృభూత, స్వామికిని నమస్కరించి సద్భక్తిమెయిన్.

వ. అంకితంబుగా నయొనర్పంబూనిన యాంధ్రభాషార్నవం బనుమహాకృతికి బనినంత సకలాంతర్యామి గావునఁ బ్రత్యక్షం బయి యెట్టులని యడిగినట్టి వినుము వివరించెద.