పుట:Andhra-Bhasharanavamu.pdf/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నడరు శవయానముగఁ బాడె బడయ యనఁగఁ గాడు మసనంబు పలికినాఁగను శ్మశాన
మడరుఁ జెఱ యనఁగాఁ బ్రగ్రహంబు దనరు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

225


తే.

అడరుఁ గారాగృహంబు గుయ్యారము చెఱ, సాల బందిగ మనఁగను జప్ప యనఁగ
ముద్ర తగుఁ దోఁచు జీవనమ్ముగను మనుట, మనికి బ్రతుకు బ్రదిమి యన మాతృభూత.

226


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు నిద్ధర క్షత్రియవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

227

ᛟᛟᛟᛟᛟᛟᛟ

వైశ్యవర్గము

సీ.

వైశ్యనామంబులు వఱలుఁ గోమట్లన బేహారు లనఁగను బేరు లనఁగ
నడక యనంగను నడత యనంగను నడవడి యనఁగను నడరు వృత్తి
కొలువని వ్రాయుట కొలుపు త్రోయుటయు లాపణము సీళితము నా వఱలుఁ గ్రమతఁ
గొలువటం చనఁగను వెలయం సేవావృత్తి వేడు టనంగను వెలయు యాచ్ఞ
యప్పనఁగ రవడి యనఁగ నలరుఋణము వడ్డి తేమాస మనఁగను వఱలు వృద్ధి
పరచి యన యాచితక మొప్పుఁ బొరిచి యనఁగఁ దద్విశేషంబు దనరును ధాతృవంద్య.

228


సీ.

అప్పులవాఁ డన నగు నుత్తమర్ణాఖ్య యధమర్ణుఁడు చెలంగు నరువరి యనఁ
దాకట్టు కుదువ యుద్దర వారకం బీడనంగను వృద్ధి చెలంగుచుండు
నాపమిత్యకసంజ్ఞ యలరు వీ డనఁగను గాఁ పనఁ గమ్మతకాఁ డనంగఁ
గమతగాఁ డనఁగను గమ్మటీఁ డనఁగను దుక్కిము చ్చనఁగను దోఁచుచుండు
హాళికాభిధ నువ్వుచే ననఁగఁ దిల్య మలరు నీరీతి ధాన్యభేదాఖ్య
వానిచే నని పలుకంగ వచ్చుఁ జమ్ము భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

229


సీ.

చే ననఁ జెలిక నా క్షేత్రంబు విలసిల్లుఁ గుచ్చెల యన రాశి కొఱలుచుండు
ద్వ్యాఢకికాభిధ పఱిగయం చనఁగను నల్పసస్యక్షేత్ర మలరుచుండు
మడి యనఁ గయ్యనా నడరుఁ గేదారంబు వెలయు లోష్టము పెల్ల పిట్ట పెట్ట
గడ్డ బెడ్డ యనంగఁ దనుపట్టుఁ బాఱనాఁగను నవదారణంబునకుఁ బేరు
పరఁగుఁ దవుగోల దోఁకుడుపాఱ నాఁగఁ దద్విశేషాభిధానంబు దగు సబళము
గడ్డపాఱనఁ జెలఁగును గొడ్డలి యనఁగాను గుద్దాలనామంబు కాలకంఠ.

230


సీ.

ములుకోల యనఁగను బొల్చును దోత్రంబు కొఱలు లవిత్రంబు కొడవలి యన
నల్పలవిత్రాఖ్య యలరు లిక్కి యనంగఁ గూలునాఁగ లవిత్రమూల మొప్పుఁ
గలప యనంగను హల మొప్పు నైర గ ట్టేరు గలపనాఁగ మీఱుఁ దదుప
కరణ మాబంధమ్ము బరఁగు మ్రో కనఁగను దలుగునాఁ బలుపునాఁ దనరుఁ గంఠ
రజ్జు పగ్గ మనంగను బ్రగ్రహ మగు రాజిలును వారె యనఁగను రజ్జుభేద
మడరుఁ దృణరజ్జు వెంటినా నఘవిభంగ భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

231