పుట:Andhra-Bhasharanavamu.pdf/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దుమ్ము దువ్వ దుమారము త్రుమ్ము తుమురు దన సదటు బుగ్గినాగఁను దనరుధూళి
నురుము నుగ్గు పొడుము పొడి సురుము సున్ని చూరనంగను విలసిల్లుఁ జూర్ణ మభవ.

220


సీ.

డాలు టెక్కెంబు సిడమ్ము పడగ యనఁ గేతునామంబులు గేరుచుండు
నహమహమిక పేరు రహి కెక్కు నోహరిసాహరి యనఁగను సమరయాత్ర
సారినాఁ దగు లావు సత్తి సత్తువ బల్మి పీఁచ మోపిక యన వెలయు శక్తి
సలిగయం చనఁగ నాశ్రయబలంబు చెలంగుఁ గడిమి యుక్కు కఱుకు గట్టి కడిఁది
నాఁగ శౌర్యాభిధానంబు గాఁగఁ జెలఁగు బీర మనఁగను బిగువన బింక మనఁగఁ
బరఁగు గర్వంబు వెలయును బంద కోఁచ పిఱికి దొంబులిగొట్టన భీతుఁ డభవ.

221


సీ.

పోరాట పోట్లాట పోరు కయ్యము చివ్వ కంగారు కంగిస కలను దురము
గొడవ బవరము జగడ మాల మని యన యుద్ధవాచముకలై యొప్పుచుండుఁ
దనరును బెనఁకువ పెనఁగులాట యనంగఁ బెనయన గుద్దులా టనిన యుద్ధ
మలరు దందడి దొమ్మి యన సంకులరణాఖ్య దంటపో రనఁదగు ద్వంద్వయుద్ధ
మలరుచుండును గన్నెకయ్యం బనంగఁ బ్రథమయుద్ధాఖ్య యెక్కటిబవరమనఁగ
నొంటిపోట్లాటపేరుగా నొప్పుచుండు భూషికభుజంగ శ్రీమాతృభూతలింగ.

222


సీ.

ఆర్పు బొబ్బ యనంగ నగు సింహనాదంబు క్రం దనఁగాఁ దగుఁ గ్రందనంబు
సొరుగు సొలపు సొమ్ము సొలిమిడి సోలు సుమాళము బవిళి మైమఱపు బ్రమరి
యనఁగ మూర్భాహ్వయం బలరారుచుండును రాయిడి రారాపు రం పనంగ
ననుమర్దనం బొప్పు హావడి యావడి యన నుపద్రవసంజ్ఞ దనరుచుండు
దామరంబగుఁ జూఱ కొల్ల పరి యనఁగ వలసయనఁ బ్రవాసాఖ్యగా వఱలు జయము
గెల్ను గెలివిడి గెలుపము గెలుపనఁదగు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

223


సీ.

పగయీఁగు టనఁదగు వైరశుద్ధి పరుగు పరువు పాణు టన భావనము చెలఁగు
గునుకు డనంగను గును కనఁగా నల్ప ధావనసంజ్ఞయై తనరుచుండుఁ
దొలఁగు డనంగను దలఁగు డనంగను నపసరణాఖ్యలై యలరుచుండు
నపజయసంజ్ఞ లై యలరు బన్నము విఱు గోటమి యోడుట యోల చెంగ
నాలువిఱుగుడు విఱుగునాఁ గ్రాలుచుండుఁ ద్రుంచుట చిదుముట తెగటార్పు పరిమార్పు
పొరిగొనుట పిల్కుమార్పు చంపుట తునుముట యనఁగఁదగు హింస భక్తహృద్వనజహంస.

224


సీ.

సమయుట యీల్గుట చాపు చక్కడఁగుట క్రుంగుట త్రుంగుట కూలుట దుది
ద్రెళ్లుట మడియుట తెగుట డీల్పదుట నీల్గుట మొదల్చెడు టడంగుట పొలియుట
మిత్తి పెన్నిదురనా మీఱును మరణము సొర సొద యనఁగను బరఁగును జిత
మొండె మనంగను బొల్చుఁ గబంధంబు పబము పీనుం గన శవము దనరు