పుట:Andhra-Bhasharanavamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పరుఁ జనఁ బరుం జనంగను బరఁగు నదియె చనును నెమ్మిలిపరుఁజునా జాపరుఁ జనం
బిడి యనంగ నుత్సర్వాఖ్య వెలయుచుండు భూషికభుజంగ శ్రీమాతృభూతలింగ.

215


సీ.

పరుఁజులోపలఁ జీలపట్టించునలుగువా యమరుపయోగ్యమైనట్టితావు
మొసలికా టనఁగను మొసలివా యనఁగను జిమట యనంగను జెలఁగుచుండుఁ
బలకయం చనఁగను ఫలకసమాఖ్యయౌ ఖేటక మెసఁగును గేడె మనఁగఁ
దద్భేదనామమై తనరును జిల్లోటి కేవడ మం చనఁ గేరుచుండు
గుదె గుదియ దుడ్డు గునుపము గుడుప యనఁగ ముద్గరము భిండివాలమ్మ పొలుచుఁ జిల్ల
కో లనఁ దగుం గుఠారము గొడ్డలి యన భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

216


సీ.

ఖండపరశు వొప్పు గండ్రగొడ్డలి యన బరిస బడిత యనఁ బరిఘ మొప్పు
సెలకట్టె యనఁగను వెలయు శల్యము సురె సురియ చూరి యనంగ ఛురిక దనరు
జముదాడి యనఁగను యమధాటి చను నేజి బరిచి యీటె యనంగఁ బరఁగుఁ గుంత
మలరును గొఱ కన నల్పకుంతాభిధ బల్లె మనంగను భల్ల మమరు
బాగుదా రన నల్పాసి పరఁగు బాఁకు వంకి చిల్లాణ మనఁగను వక్రశస్త్ర
మలరుచుండును డొంకెన యనఁగ వెలయు నాయుధవిశేష నామమై యజ్ఞమౌళి.

217


సీ.

వాయిదా రనఁబడు వంకలు గలకత్తి దోదుమ్మి సై బనఁ దోఁచుచుండు
నాలక్షణము గల్గి యాగతి వంపైనఁ బరఁగుచునుండును గిరు సనంగ
నొడిసె యనంగను నడరు నావిద్ధము గ్రాలుఁ ద్రికాష్ఠి తిక్కటి యనంగఁ
దగు శిలాయంత్రంబు దంచన మనఁగను వసి గసి మే కన నెసఁగు శంకు
భేదనామంబు లగును శోభిల్లును సుర కోవి పీరంగి బాణము గుంటకోవి
జబురుజంగి తుపాకి జజా యనంగ వెలయు నగ్నిప్రసారణాఖ్యలు మహేశ.

218


సీ.

బాదరు నాఁగను బరఁగుఁ దుపాకిలోపలను జానకిత్రాఁడు నిలుపుతావు
చుఱుకైనమందుపే ర్పరఁగు రంజక మనఁ లగ్గనఁ బ్రాకారలంఘనంబు
అది రెండువిధములఁ బొదలుచుచుండును లగ్గనా సురతాణిలగ్గ యనఁగఁ
బాషాణదార్వగ్ని భాండాదికాభిధ లగ్గదిం పనఁగఁ జెలంగుఁ బోక
తరలుడు తరలిక యరుగు డరుగడమ్ము కదలుడు కదలిక కదలు కదలడమ్ము
చనుట యేఁగుట మేగుడం చనఁగ యాత్ర తగును దైవతయాత్ర జాతర యన భవ.

219


సీ.

వెలువడుట యనంగ వెడలుట యనఁగను నిర్గమనాఖ్యగా నెసఁగుచుండు
నెఱచుట యనఁగను బరఁగుఁ బ్రసరణాఖ్య యభియానము దనర్చు నఱముటయన
విద్రావణాభిఖ్య వెలయుంచునుండుఁ దోలుట యనంగను బఱచుట యనంగ
నెసఁగు నపక్రము మీడేరె ననఁగను దాడి యనంగను ధాటి యగును