పుట:Andhra-Bhasharanavamu.pdf/62

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దండు వన దండు గనఁగను దండమునకుఁ బ్రతినిధిగఁ దీయుద్రవ్యంబు పరఁగు విజన
మొంటిపా టేకతం బన నొప్పుచుండు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

190


నమ్మికనాఁగను నచ్చికనాఁగను విశ్వాససంజ్ఞ యై వెలయుచుండు
నిమ్మళం బనఁగను నిష్కలంకత యొప్పు నిశ్చింత దనరును నెమ్మది యనఁ
దగ వనఁ బాడినాఁ దగు న్యాయనామంబు మనును జాలిక నా సమర్థనాఖ్య
యానతి యనఁగను నాన యనంగను సెలవురా ముదలనాఁ జెలఁగు నాజ్ఞ
గడు వనఁగ మేర యనఁగ నుగ్గడి యనంగ నడరు మర్యాద తప్పిదం బాగడంబు
దుడుకు నేరము నేరమి దుండగంబు తప్పనఁగ నపరాధము తనరు నభవ.

191


సీ.

ఆరి బడి యప్పన ముప్పున పంగము పంజి పన్నాడి కో ల్పగిది బెడిగ
కోరనఁగాఁ జెలఁగును భాగధేయంబు గృహభాగధేయ మౌ నిల్లరి యనఁ
బుల్లరినాఁగ నొప్పును దృణభాగధేయంబు కాలరినాఁగ ననుపునాఁగ
నభిగంతృభాగధేయము చెలంగును నెల పన ధాన్యపరిమాతృభాగధేయ
మలరుచుండును పట్టమం చనఁగ వెలయు హేయదీనారముఖభాగధేయసంజ్ఞ
సుంక మన దాణ మనఁగను శుల్క మెనఁగు లంచ మనఁగను నుపదయై మించు నభవ.

192


సీ.

కానుక కానిక కప్పము సూడిద యులుపా యుపారంబు నులుప యనఁగఁ
జను నుపాయనసంజ్ఞ చామరం బొప్పు వింజామర యనఁగను సౌర మనఁగఁ
దద్భేదసంజ్ఞయై తనరారు గొడు గన గొడు వన ఛత్రాఖ్య యడరుచుండు
జగజం పనంగను జల్లినా జంపన ఝల్లరీనామమై యుల్లసిల్లు
నర్షవారణనామమై వఱలు జిగ్గు గొడు గనఁగఁ జర్మఫలకంబు కొఱలు నరిగె
యనఁగ భృంగారు గిండినాఁ జను బిరుదము బిరుదనఁ బవాడ మనఁగను బరఁగు నభవ.

193


సీ.

వేలము పాళెము వీడుపట్టు బిడారు విడిది యంచనఁగ నివేశ మొప్పుఁ
జదలమం చనఁగను స్కంధవారము మీఱు నేనుంగు హత్తి గౌరేనుఁ గేన్గు
నాఁగ దంతావళనామమౌ మొక్కడీఁ డన నల్పదంతగజాఖ్య దనరుఁ
గలభంబు గున్ననాఁగను జెలువొందును బెంటియేనుఁ గనంగ వెలయుఁ గరిణి
తొండ మనఁగను దుండాఖ్య తోఁచు జాల పొగరుపొడ యనఁ బద్మము ల్దగును గీక
యనఁగ ఘీంకారనామధేయంబు చెలఁగు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

194


సీ.

మదము రాజిలు మస్తు మత్తు మత్తాయన నాలానసంజ్ఞ యై యలరుఁ గట్టు
కంబ మనంగఁ దోత్రంబు బరి యనఁగ నారెగోల యనంగ నలరుచుండు
శృంఖలనామంబు చెలఁగు సంకెల యన సంకుశనామమౌ నంకుసమ్ము