పుట:Andhra-Bhasharanavamu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మనును నొంటనివాఁ డన మార్తుఁ డనఁగఁ బగతుఁ డనఁ బగ ఱనఁ బగవాఁ డనంగఁ
గంట నఁగ గొంగ యన సూఁడుకాఁ డనంగ భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

185


సీ.

చుట్టము పక్కము చుట్ట నెచ్చెలి చెలికాఁడు నెయ్యుఁడు సంగడూఁడు పొందు
కాఁ డంటు చెలి నేస్తకాఁడు సంగడికాఁడు నాఁగను మిత్త్రుని నామము లగుఁ
బగ సూడు కంటునాఁ బరఁగు విద్వేషంబు చెలిమి చుట్టరికంబు చెల్మి నెమ్మి
నెయ్యము నేస్తము నెయ్యమి సంగడి యొద్దిక యొమ్మిక యొండొరిమిక
పొం దొరిమె పొత్తుగారము పొందిక యనఁ బరఁగుచుండును మిత్త్రభావంబు బట్లు
క్రిక్కలనఁ బాఠకాఖ్యలు గేరుచుండు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

186


సీ.

నమ్మినవాఁ డన నచ్చినవాఁ డనఁ జనవరి యనఁగను దనరు నాప్తుఁ
డలరును గరణమం చన లెక్కవాఁ డన గణకాభిధానంబు కరణిక మన
గణకునిభావంబు కర్మంబు వెలయును లిపికారకుం డొప్పు లేకరి యన
వ్రాఁతకాఁ డనఁగను వ్రాలునా వ్రాతనా లిపియొప్పు నక్షరాల్ వెలయుచుండుఁ
నక్కరము లచ్చరమ్ములం చనఁగఁ గ్రార గిలక యన రేఫ మెసఁగును గియ్య యనఁగ
నడరును యకారనామంబు సుడియనంగ వట్రువయన ఋకారమై వఱలు నభవ.

187


సీ.

బొట్టన సున్ననఁ బొలుపొందు బిందువు నిడుదన దీర్ఘంబు నెగడుచుండు
జిడ్డయం చనఁగను సంయుక్త మొప్పును గణితంబు లెక్క నాఁగను దనర్చుఁ
గమ్మ యనంగ లేఖ యగు రాయస మన రాజలేఖ దగుఁ గిల్లాకు చీటి
యన ఖండపత్త్రిక యలరును గౌలన నభయపత్త్రాభిధ యలరుచుండు
ఘట్టితపటంబు వెలయును గడిత మనగ వెలయుఁ గాకిత మనఁగఁ దచ్భేదసంజ్ఞ
యాడె యనఁగఁ దదేకదేశాహ్వయ మగుఁ బుస్తకము పొత్తమన మీఱు భుజగభూష.

188


సీ

గంట మనంగను గనుపట్టు లేఖిని కలమము కలము నాఁగను దనర్చు
రాయబారి యనంగ రాజదూత యగుఁ దద్భావంబు తగు రాయబార మనఁగఁ
బథికుఁడు దగుఁ దెరువరి యన మార్గజ్ఞ సంజ్ఞ యౌఁ జొప్పరి జాడకాఁడు
నాఁ బలుపట్టడ నాఁగఁ బౌరశ్రేణి పొలుచును రాజ్యాంగములు దనర్చు
సామి ప్రెగ్గడ చెలి బొక్కసము తిరస్తు కోట సౌఁ జనఁగాను షడ్గుణము లగుచు
బేరుకొనఁగాను దగు సంది పోరు పోక యునికి రంటన నొండన నుగ్రమూర్తి.

189


సీ.

వాఁడిమి జతనము మంతనం బనునట్టి యివిమూఁడు శక్తులై యెసఁగుచుండుఁ
దగుఁ ద్రివర్గాభిధ తగ్గు నిల్కడ పెరుగుడు నను నివిమూఁడు గొఱలు నవలఁ
జతురుపాయంబులసంజ్ఞయై మం చీగి వేఱు కొట్టన నాల్గు వేఱు వేఱ
వేఁడిమి యనఁగను వాఁడిమి యనఁగఁ బ్రతాపాభిధానంబు తనరుచుండు