పుట:Andhra-Bhasharanavamu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నల్లొనేరేళ్ళు జోదిళ్ళు ననఁగఁ దనరు వేఁడికోలనఁ బ్రార్థన వెలయుచుండు
భిక్ష తిరిపము బికిరము బిచ్చ మాయవారమును జోగునాఁగను పఱలు నభవ.

175


సీ.

అవిరక్తభిక్షకుఁ డలరును బికిరాలమారి బికాసి బికారి తిఱ్ఱి
గొట్టు తిఱ్ఱి తిరిపగొట్టునా వటుఁ డొప్పు వడుగు బొమ్మాచారి తడుపుదాల్చు
నా గృహస్థాభిధానం బిలుదొర గేస్తు నా వనసంవాసినామ మెసఁగు
నడవినెలవరినా జడదారి యనఁగను గనుపట్టు సన్యాసి కావిగోఁచి
దారి బోడ కబిసినాఁగఁ దనరు యోగి జోగి నాఁదగు జడదారినాఁగఁ దపసి
నాఁగ ఋషిసంజ్ఞ జన్నిదం బనఁగ యజ్ఞసూత్రమౌ నంబరకచ.

176


సీ.

పొసఁగుఁ గమండలు బుడిగ యనంగను బుడ్డిగ యనఁగను బుడ్డి యనఁగ
బోలెనాఁగను గకపాలనాగను గక్షపాలాహ్వయంబుగాఁ బరఁగు ధార్య
చర్మనామము కళాసము కళవస మన యోగివేత్రాభిధ యొప్పు లాత
మనఁగ ముండన సంజ్ఞ యలరుచునుండును గోఁగుట బోడింపు గొఱుగుట యన
నుపనయనమగు వడుగునా నొప్పగును వివాహనామంబు పెండ్లి చేపట్టు కాలు
ద్రొక్కు పెండిలి యనఁగఁ బెంపెక్కు నేఁగు పెండ్లనఁ దదంతవీథికావిహృతియ భవ.

177


సీ.

వడుగు పెండ్లిండ్లలోపలఁ దృతీయదినంబు పాకెన్న యనఁగను బరఁగుచుండు
నారింటికిని వేఱె యగుచు నంత్యదినంబు లవును గంబవలి నాగవలి యనఁగఁ
బెండ్లికూఁతు రనంగఁ బెండ్లికొడు కనంగఁ గ్రమముగాను వధూవరాఖ్యలు దగుఁ
జిమ్మనగ్రోవినా శృంగమౌఁ దద్భేద మండె బుఱ్ఱటకొమ్ము ననఁగ వెలయుఁ
గొఱలుఁ గవయుఁట కూడిక కూటమి కలయిక యన ప్రతి యహిరతి యెసఁగు మసక
మనఁగ బశుమృగరతము చెన్నలరుఁ ద్రొక్కు డనఁగఁ బొర్లుట యనఁగ దేవాధిదేవ.

178


సీ.

పొత్తనఁగ సజగ్ధి పొలుచు బువ్వ మనంగ స్వజనవివాహసజగ్థి దనరు
హరిబువ్వ మన వివాహచతుర్థదినరాత్రి బందుజనసజగ్ధి పరఁగుచుండు
బాలిక జాదారపాలిక నాఁగరు నంకురార్పణశరావాఖ్య దనరుఁ
బ్రథమవధూపరభవనప్రవేశాఖ్య యిలునింపడ మనంగ నెసఁగుచుండు
నుంకు వన నోలి యనఁగను సంకనంగఁ బైఁడి యనఁ గన్యకాశుల్కవాచక మగ
నరణ మనఁ బితృదత్తకన్యాధనంబు పొలుచును వినంగ శ్రీమాతృభూతలింగ.

179


సీ.

ఉపరిసురతసంజ్ఞ యొప్పును మగపోల్కి కూటమి యనఁగఁ బైకూటమి యన
మణితవాచకములై మనుఁ బావురాపల్కు లనఁగఁ గూఁకీపల్కు లనఁగ నవియె
లోగుక్క వెలిగ్రుక్క నాఁగఁ జెలంగును దంతక్షతాభిధ తనరుచుండుఁ
బలుగంటు పలునొక్కు పలుగెంపు లనఁగను గరరుహక్షతములు మెఱయుచుండు