పుట:Andhra-Bhasharanavamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పేట మొప్పును జీరనా వెలయుఁ బ్రసృతి పొలుపగు నికుంజహస్తంబు పుడిసిలి యన
భాసిలు నికుంజచతురంగుళీసమాఖ్య కొడిద కొడిదిలి యనఁగ రక్షోవిదార.

140


సీ.

పిడికిలి పిడియన నడరును ముష్ట్యాఖ్య పాణివిశేషంబు పరఁగును గమి
కిలి కుప్పలప్ప పట్టిలి యన దోసిలి దోయిలి నాఁగను దోఁచుచుండు
నంజలి మూరనా హస్త మొప్పును బిడి తక్కువమూరనాఁ దగు నరత్ని
బారయం చనఁగను మీఱును వ్యామంబు నిలువునాఁ బౌరుషం బలరుచుండుఁ
గౌఁగిలి యనంగ బాహుయుగవలయ మగు గొంతు గొంతుక కుత్తుక కొలికి బొండు
ననఁగ గంఠంబు చెలఁగును నఱ్ఱు మెడన గ్రీవ దనరారు మేచకగ్రీవ దేవ.

141


సీ.

మెడవంపునాఁగను మీఱు గ్రీవాగ్రభాగము పెడతలనాఁ గృకాటిక దగు
మొగము మో మనఁగను ముఖమొప్పు మోరనా ముట్టెనా వెలయును ముఖవిశేష
ము లగు వా వాయి నో ర్మూతీనా వక్త్రంబు మనుఁ దదంతస్థాన మంగిలి యన
ముక్కన సాసిక పొల్చు ముంజెర మనఁ జెర మన నాసాపుటము చెలంగుఁ
బరఁగుఁ బల్కప్పు మోవి వాతెఱ పెదవియు నాఁగ నోష్ఠంబు తదధరభాగ మలరు
నౌడు నాఁగను జుబుకాఖ్య యలరు గడ్డఁ మనఁగ గద్దువనాగ దేహధృతనాగ.

142


సీ.

చెక్కు చెక్కిలి చెంక చెంప గౌద యనంగ గండస్థలాఖ్యయై యుండు హనువు
కటమరయం చనఁగా నొప్పుఁ బల్లనఁ దంతమౌఁ గోఱనా దంష్ట్ర వెలయుఁ
దాలుపు దాలువ దవడ దౌడ యనంగ నలరును దన్మూలనామ మంకు
నక్కిలి యన మీఱుఁ బుక్క పుక్కిలి బుగ్గ నాఁగ గండూషమౌ నాల్క యనిన
జిహ్వ వెలయును సెలవినా సృక్విణి తగు నొసలు నుదురన ఫాలాఖ్య యొసఁగు భ్రూవు
బొమ యనంబడుఁ దారకం బొనరుఁ బాప యాబ యన గోళకమగు గ్రుడ్డనఁగ నభవ.

143


సీ.

పర పొర యనఁగను బటలంబు విలసిల్లుఁ గన్ను నా లోచనాఖ్య దనరారుఁ
జూపు చూడ్కి యనంగ దోఁపఁబడును దృష్టి వాలుచూ పనఁ బొల్చు వక్రదృష్టి
యశ్రువు కన్నీ రటంచన రాజిలుఁ బక్ష్మంబు వెలయు ఱెప్పం చనంగ
ఘనపక్ష్మసంజ్ఞ దొంగలిఱెప్ప లన మీఱుఁ గడక న్ననంగఁ గ్రేఁగ న్ననంగ
నగు నపాంగంబు చెవి వీ ననంగ శ్రవణ మొప్పు గూ బనఁగాఁ గర్ణమూల మెసఁగు
సిరసు తలనెత్తి యనఁదగు శిరము జనుఁ గడంత యనఁగ శిరఃపార్శ మంతకారి.

144


సీ.

ఔదల ముందల యన శిరోగ్రము మీఱుఁ జనుఁ బెడతలనఁ బశ్చాచ్ఛిరంబు
బ్రహ్మరంధ్రాభిద పరఁగు నుచ్చెన వెండ్రుక నెఱి నెఱక నాఁగఁ దనరుఁ గేశ
మలకలు కురు లన నలరును బహుతచే వఱలు ముంగురు లన భ్రమరకములు
కూఁకటి యనఁ జిప్పకూఁకటి యనఁ గాకపక్షంబు చెలఁగుఁ గబరికిఁ దురుము