పుట:Andhra-Bhasharanavamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఆనెయం చనఁగను నాణెయం చనఁగను దద్దురం చనఁగను ద ద్దనంగ
దద్రువు వెలయుఁ బిత్తంబు చెలంగును బిచ్చనఁ బస రన వీర్య మొప్పు
విత్తనశ్లేష్మంబు వెలయుఁ గళ్లె యనంగ నట్టన తిత్తినాఁ జట్ట యనఁగఁ
దోలనఁగాఁ ద్వక్కు దోఁచును నంజుడు పొల యెఱచి కవుచు పొలుసు కండ
చియ్యయం చనమాంసంబు చెలఁగుఁదస్స యనిన దుర్మాంసనామమై యలరు నుప్పు
కండ యనఁగను మీరు శుష్కపలలాఖ్య యార్యజనగేయ మాతృభూతాభిధేయ.

131


సీ.

రక్తాభిధాన మెఱ్ఱ యనంగ నెత్తు రనంగను నెగడుచుండు
రక్తవిశేషంబు రాజిల్లు నల్లనాఁ గృత్రిమరక్తంబు గేరు జొత్తు
నాఁ జెలఁగును దొబ్బనా ఘనీభూతరక్తంబు చీ మనఁగను దనరుఁ బూయ
మెసఁగును గుండెనా నెద యనఁ గందన గాయ యన హృదయాఖ్య వన చెలఁగుఁ
క్రొవ్వునా నర మన నాడి నివ్వటిల్లు మన్ని యనఁగను విలసిల్లు మన్య బీఱ
నరము నాఁగను దగుఁ బీతనాడి నీరుతిత్తి యనఁగను గ్లోమమౌ దేవపూజ్య.

132


సీ.

మస్తిష్కనామంబు మను మెద డంచనఁ గండచుక్క యనంగఁ గాలఖండ
మలరును బ్రేగన నాంత్రంబు చెలఁగును మూలుగునా మజ్జ పొలుచు బొమిక
నెర కె మ్మెముక యన నెగడు సస్థ్యభిధాన మగు ముడు సన గ్రంథిలాసిసంజ
యడరియుండుఁ గశేరుకాహ్వయంబుగనుగ్రో వెముక యంచనఁ బూసయెముక యనఁగఁ
దనరును గరోటి కప్పెర పునుక పుఱ్ఱె పుచ్చె యన బోలె బొచ్చెనా బోఁకి బొంకి
పెంచు పెంకు పెంచుక పెరకం చనంగఁ దద్విశేషాఖ్య పార్వతీదత్తసౌఖ్య.

133


సీ.

మలవాచకం బగు మసటు నింపిరి మస్టు ముఱికి యనంగను మూర్ధమలము
వెలయుచుండును గర్ణమలనాడు మొప్పును గులిబినా గుబిలినా గులిమి యనఁగఁ
బుసి యటం చనిన నొప్పును నేత్రమలసంజ్ఞ యేరు గనఁగ విష్ఠ యెసఁగుచుండుఁ
బేఁడ నాఁగ గవాదివిష్ఠ మీఱును నేడకాదులనిష్ఠ రొచ్చనఁగఁ దనరు
రెట్ట యనఁగను బక్షులవిట్ట మమరు మేను నెమ్మేను మై మయి మే మెయి యొడ
లన శరీరంబు దనరు బొం దనఁగ డొక్క యనఁ గళేబర మలరుఁ బశ్యల్లలాట.

134


సీ.

ఆయంబు కీలునా నలరు మర్మంబు పాదాగ్రము ముంగా లటం చనఁ దగు
మీఁగా లటన్నను మీఱుఁ బాదోపరిభాగంబు దనరును బాదతల మ
డు గఱకా లంజనా నగు గుది చీలమం డనఁగ వెలయును గుల్ఫాహ్వయంబు
మడమయం చనఁగను మనుఁ బార్ష్ణి కొంకినాఁ దదుపరిదేశమై తనరుచుండుఁ
జిఱుతొడ యనంగఁ బిక్కనాఁ జెలఁగు జంఘ ముడుము మోఁకాలునాఁగఁ జెన్నడరు జాను
కురువు తొడ యన నూరువు వరఁగుచుండుఁ బొసఁగుఁ బెందొడ యన నూరుపూర్వ మభవ.

135