పుట:Andhra-Bhasharanavamu.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

పట్టి బిడ్డనఁగ నపత్యంబు దగఁ గన్నకొడుకు కొమారుఁడు కొమరుఁ డనఁగఁ
బుత్త్రాభిధానంబు పుత్త్రికాహ్వయ మొప్పుఁ గూఁతు కొమారిత కూఁతు రనఁగఁ
స్నుష కోడలనఁగను శోభిల్లు గోడంట్ర మనఁగఁ గోడఱికమం చన స్నుషాత్వ
మలరును జామాత యల్లుఁడం చనఁగను నిల్లంట్ర మనఁగను నిల్లట మన
శ్వశురగేహాధివాసంబు చనును వెలయు నల్లె మనఁగను జామాతృతాఖ్య మనుమఁ
డనఁగ నప్త చెలంగును మనుమరాలు నాఁగఁ దనరారు నస్త్రి చంద్రార్ధచూడ.

111


సీ.

అయ్యబ్బ తండ్రి యం చన జనకుం డొప్పు నమ్మవ్వ తల్లియం చనఁగ మాత
దనరును దాదినా ధాత్రియై చెన్నొందుఁ దాతనా వెలయుఁ బితామహుండు
పరఁగు ముత్తాతనఁ బ్రపితామహాభిధ యలరుఁ బితామహి యవ్వ యనఁగ
వఱలు ముత్తవ్వనాఁ బ్రపితామహీసంజ్ఞ తర మనఁగఁ బురుషాంతరము చెలఁగుఁ
జుట్ట లన విందు లనఁగను జుట్టము లన బందుగు లనంగఁ జెలఁగును బాంధవాఖ్య
దాయ యనఁగ సగోత్రాభిధాన మొప్పు పాలవీక్ష పురాంతక చోళశిక్ష.

112


సీ.

తోఁబుట్టు తోడు సైఁదోడు నా సహజుఁడౌ నన్నయం చనఁ దగు నగ్రజుండు
తమ్ముఁడం చనఁగను దనరును ననుజుండు తోడఁబుట్టిన దనఁ దోఁచు భగిని
యక్క యప్ప యనంగ నలరును నగ్రజ చెల్లె చెలియ లనఁ జెలఁగు ననుజ
చనును బరంపరాసంబంధి యంతల పొంతలవాఁ డందిపొందినట్టి
వాఁ డగంగను యాతయై పరఁగుఁ దోడికోడ లేరా లనఁగ మేనకోడ లనఁగ
భాగినేయి దనర్చును భాగినేయుఁ డలరు మేనల్లుఁ డనఁగఁ జంద్రార్ధచూడ.

113


సీ.

అత్తయం చనఁగను నలరు నన్యోన్యంబు జాయాపతులకును జనను లైన
మాకునాఁ దత్పితృనామమై విలసిల్లు నడరు బావయనఁ దదగ్రజాఖ్య
తదనుజాహ్వయము లై పొదలు మఱంది నా వదినె నాఁ దజ్జ్యేష్ఠలు దగియుండ్రు
మఱఁదలం చనఁగను మండ్రు తదనుజలు వియ్యంకుఁ దనఁగను వియ్య మనఁగఁ
దత్పితృమిథోభిధానమై తనరుచుండు నమరు వియ్యంపురాలు వియ్యంపుసాని
నాఁగను బరస్పరము తజ్జననుల పేళ్లు నియ్య మనభావమగు నొక్కవేళ శర్వ.

114


సీ.

సవతియం చనఁగను జనును సపత్న్యాఖ్య మాతులుం డగు మేనమామ యనఁగ
మీఱ బితృష్వస మేనత్త యనఁగను మేనమఱఁద లన మేనవదినె
మేనమఱఁది యన మేనబావ యనంగఁ జనును మాతులవితృవ్ష్వసృకనిష్ఠ
పూర్వజపుత్త్రు లొప్పుదురు శరీరసంబంధబాంధవ్యాఖ్య మనుచునుండు
మేనఱికమం చనఁగ ధవుఁడౌను మగఁడు పెనిమిటి చెలువుఁ డన జారు పేరు మేలు
వాఁ డనఁగ మిండఁ డన మిండగీఁ డనఁ దగు ఱంకన న్వ్యభిచారమౌ రవివతంస.

115