పుట:Andhra-Bhasharanavamu.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కత్తె మన్నను దన్నఖాహతికిఁ గేలఁ దొడిగియుండినచర్మంబు దోఁచియుండు
వానికనుమర్వు దనరుఁ దోపార మనఁగ దోరె మనఁగను దగు నానిదార మభవ.

90


సీ.

గూబ కోటఁ డనంగ ఘూకంబు విలసిల్లుఁ బరఁగు నేట్రింతనాఁ బసులపోలి
గాఁ డనినను వ్యాఘ్రఘాటాఖ్య యగుచుఁ గాటుకపిట్ట రువ్వపులుఁ గనఁ దనరు
ఖంజరీటాభిధ కంకణం బనఁగను రాబులుఁ గనఁగను బ్రబలు లోహ
పృష్టాఖ్య ధూమ్రాట మెసఁగును గూఁకటి మువ్వనాఁ గూఁకటీమూఁగ యనఁగ
బాలయం చనఁగఁ గికీదవంబు పరఁగు వెలయుఁ గనకక్షి సకినాలపులుఁగు గుబిలి
పైఁడికంటినాఁ జాతకం బలరు వానకోయిల యనంగఁ గైలాసకుధరనిలయ.

91


సీ.

కోడి యనంగను గుక్కుటస్త్రీ పుంస సామాన్యసంజ్ఞయై చనును గుక్కు
టంబు పుం జనఁగ నడరు నది పెంటిపో లికనున్నఁ బెట్టమారి యనఁ బరఁగుఁ
కుక్కుటినామ మగును బెట్టయనఁగను నారెబొట్టె యనఁ దదంఘ్రి జన్య
కంటకాతినిశితాంగం బొప్పుఁ గారుకో డనఁ జను వనకుక్కుటాహ్వయంబు
సలిలకుక్కుటనామంబు వెలయు నీరుకోడియనఁ బుల్లగొర కన గుండఁగి యనఁ
గర్కరేటువు దనరును గక్కెర యరం బిచ్చుక యనంగఁ జటకంబు వెలయు శర్వ.

92


సీ.

మ్రానిపోటుపులుఁగునా నొప్పుచుండు దార్వాఘాటనామంబు వాయసంబు
కాకినాఁ దగు మాలకాకి నాఁగను ద్రోణకాకంబు విలసిల్లుఁ గాకభేద
మగును జెమరుకాకి యన నీరుకాకి నా జలకాక నామమై చెలఁగుచుండు
వాత్యూహసంజ్ఞయై తనరుఁ గూకురుగుండె నాఁగ గృధ్రము గ్రద్ద నాఁ దనర్చుఁ
గాంచ కొంగ యనంగను గ్రౌంచ మెసఁగు బకము విలసిల్లు నారణపక్కి పక్కు
సగ్గటం చన నాడెలు బా తనంగ నగుశరారి పదాంబుజనతకిరీటి.

93


సీ.

గాఁ జనఁ గై జనఁగాఁ గపింజల మొప్పు బెగ్గు రుయ్యలచేఱుపిట్ట యుయ్య
లపులుఁగు నాఁగ సారస మగు జక్కవ యనఁ గోక మలరును హంస మంచ
మనఁ దగు రాయంచ యనఁ రాజహంసంబు పరగు బలాక కొక్కెర యనంగఁ
గొక్కరాయి యనఁ బెం పెక్కును విలసిల్లుఁ గోయష్టికము గుడ్డికొక్కెర యనఁ
బ్రబలును జతూక చీకురువాయి యనఁగఁ జీకురాయి యనంగను జీవుక యన
గబ్బిడాయి యనంగను గబ్బిల మనం దైలపాయిక చెన్నొందు దక్షశిక్ష.

94


సీ.

మక్షిక యీఁగ నా మను మధుమక్షిక తేనిఁగ జుంటీఁగ నా నెసంగుఁ
బెరయీఁగ నాఁగను బరఁగుఁ బతంగిక జోరీఁగ నాఁగను మీఱును బశు
పక్షిక వల్మీకమక్షిక యూసిళ్లు నాఁగను బహుతచే నలని యుండుఁ
గందురీగ లనంగఁ గణుదురు లనఁగాను గండోళి దగు మశకంబు దోమ