పుట:Andhra-Bhasharanavamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేఁక యనఁగను రేఖయై రీతిగాంచు గర యనఁగఁ దద్విశేష మై పరగుచుండు
దొర యన దొంతి యనఁగను దొంతర యనఁ దనరు నుత్పంక్తి మాతృభూతాఖ్యలింగ.

34


సీ.

మొలక మొలవ మొక్క మోక మో సీరిక మొటిక నా నంకురం బొప్పుచుండు
మీ ఱటం చనఁగను మీఱు వాప్యాంకురావలి కోడ యనఁగను బోలుచుఁ చద్వి
శేషనామంబు తసి యన సడ యనఁగఁ దన్నిరంతరపంక్తి దనరుచుండు
మ్రాఁకు మ్రా ననఁగ ననోకహసంజ్ఞయౌఁ జెట్టన నోషధి చెప్పఁబడును
వాడినది యన ఫలిత మౌ వంధ్య సంజ్ఞ యగును గొడ్డనఁ బుష్పితం బగును బూచి
న దనఁ గోరకితం బొప్పు ననిచిన దనఁ జెలఁగుఁ బల్లవితము చిగిర్చిన దన భవ.

35


సీ.

మోడు మో టనఁగ నొప్పును స్థాణునామంబు గున్న యం చనఁగను క్షుపసమాఖ్య
పాద రీరము పొదనాఁ బొలుచు గుల్మాభిధ తీఁగ తీవ యన లతిక దనర్చు
లతికావిశేషం బలనునాఁగఁ జెన్నొందు నలరు లతాప్రతానినియు జొంప
మనఁగఁ బొడవు పొడ గనఁ గనుచ్ఛ్రాయమౌఁ బోల్ప్రకాండము మొద ల్మొద్దనఁగను
బుగ్గ యనఁ బుంగ యనఁగను బరఁగుచుండు స్కంధశాఖాఖ్య మనఁగాను శాఖ
మరయు మండ యనంగను వితతశాఖ పరఁగును సుగంధి కుంతలాంబాసమేత.

36


సీ.

రెమ్మ రెబ్బ రివట రివ్వ సెలగ చివ్వ చివక మల్లె జబర చివర సురిగ
పలుగు గోల బరగు సెల యన నుపశాఖ చెలఁగు నూడ యనంగ శిఫ దనర్చుఁ
కొస కొన మొన యన నలరు వగ్రాభిధ వేరన దుం పన వెలయు మూల
మొనరుఁ జే గనఁ జేవ యనఁగ సారము పేరు తొడు పట్ట తోలుక తోలు చెక్క
తొంట చెక్కు తడప యంట త్వగ్యాఖ్యయౌ త్వగవయవము దనరు బరడు నాఁXఁ
బరఁగు నార యనిన వల్కలసంజ్ఞయై మాతృభూత లోకమాతృభూత.

37


సీ.

ములు వసి యనఁగను జెలఁగుఁ గంటక సంజ్ఞ తొడుగఱ్ఱ యీడిక సుడుము కంప
యనఁ దనర్చును గంటికాదిభారము కట్టె కట్టియ నాఁగను గాష్ఠ మొప్పుఁ
దనరుఁ గొయ్య యనంగ దారుసమాఖ్యయై దుంగ యనంగను స్థూలదారు
కాండంబు వెలయఁఁ జెక్కనఁగఁ దద్దరు భేదంబు పే డన సూక్ష్మదారుభేద
మగును జిదుగన సమిధాఖ్యయలరుఁ దొట్టి తొట్రు తొఱ్ఱ తొఱట యనఁ దోఁచుఁ గోట
గొమ్ము గొల యనఁగాను వల్లరి యెసంగుఁ బత్తి రా కనఁ బర్ణమౌఁ బార్వతీశ.

38


సీ.

పాదరజస్సంజ్ఞయౌ సద యనఁ జిగు రిగురు తలి రనంగ మీఱును గిసలయ
నామధేయము పై రనంగను బయిరు నా ససి యనఁగాను సస్యము చెలంగుఁ
దొడిమె నా వృంతంబు దోఁచుఁ బండనఁగ ఫలం బొప్పుచుండు శలాటు వగును
కా యనఁ బిందనఁగాను బాలశలాటువు చను బూఁబిందెనాఁ బూప యనఁగఁ