పుట:Andhra-Bhasharanavamu.pdf/30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

చుట్టుకొం డన మేరగ ట్టనఁ జక్రవాళాచలసంజ్ఞలై యలరుఁ బొడుపు
కొం డనఁ దూరుపుకొండ నా నుదయాద్రి యమరు నస్తాద్రి పడమటికొండ
క్రుంకుకొండ యన నగు న్మంచుకొండనా వలిమల యనఁగ గుబ్బలిదొర యనఁ
బ్రాలేయశైలంబు పరఁగుఁ గవ్వపుఁగొండ తరిగట్టు నాఁగ మందరము వెలయు
ద్రోణపర్వత మొప్పు మందుల యనఁగఁ దనరు మడికాసుగట్టునాఁగను శివాద్రి
వింధ్యశైలాభిధాన మౌ వింజ మనఁగ మాతృభూతేశ దుష్కృతమత్స్యదాశ.

28


సీ.

రాయి కల్లనఁగ శిలాఖ్య యాఁ జట్టన క్ష్మామగ్నశిల యొప్పుఁ జాఁపఱాయి
చలుప యం చనఁగను జనుఁ బక్షహీనశిలాఖ్య బం డన విశాలశిల యొప్పు
వర్తులశిలపేరు వఱలు గుం డనఁగను మొరప మనఁగను శర్కర దనర్చుఁ
బలుగురా యనఁగను బాండుశిలాఖ్య యౌ బలపమం చనఁగను జెలఁగు ఖటిక
యిటుక యిట్టుక యిట్టిక యిటిక యనఁగ నిష్టకం బొప్పు మిడుగుఱాయి యన సూది
రాయి యనఁగను గఠినశిలాఖ్య యెసఁగు మూర్ధధృతగంగ శ్రీమాతృభూతలింగ.

29


సీ.

శిఖరాఖ్య యొప్పును సిగరము గుబ్బ పే టనఁ జఱి జఱియ పడకు పణ కన
నెగడుఁ బ్రపాతంబు నెత్తమం చన బ్రస్థ మలరును నెల యన నడరు నంబు
జన్మదేశాఖ్య యుత్సాఖ్యయౌ నూ టన బుగ్గయం చనఁగను మొగ్గ యనఁగఁ
నుత్సవిశేషమై యొనరును దొన యన ద్రోణవాచకముగాఁ దోఁచుచుండుఁ
బాఱు డనఁగఁ బ్రవాహమౌ వాఁక యనఁగ వాఁ గనఁగ సెలయేఱునా వ్రంత యనఁగ
నచలనది యొప్పుఁ గోనయం చనఁగ శైలదీర్ఘకోణంబు విలసిల్లు దివ్యతేజ.

30


తే.

గొంది యనఁగను గిర్యల్పకోణ మొప్పు, లోయ యన లొద్ది యనఁగఁ బొల్పొందుచుండు
నచలమధ్యధరాఖ్య వాయ యని పల్క, శైలవిశ్లిష్టభూమి యౌఁ జంద్రమౌళి.

31


తే.

గని యనఁగ నాకరం బగు గైరికంబు, జేగుఱం చన విలసిల్లుఁ జెలఁగును గుహ
గవి యనఁగ జాజు జాదు నాఁగను జనర్చు, ధాతునామంబు మాతృభూతాభిధాన.

32


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగ శైలవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

33

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

వనౌషధివర్గము

సీ.

అడవి కాన యనంగ నటవి యై తగును బేరడవి నాఁగను నరణ్యాని చెలఁగు
దోఁటయం దనఁగను దోఁచు గృహారామ ముపవనసంజ్ఞ యై యుండుఁ దోఁపు
నాఁగను బ్రమదవనాభిధయౌను సింగారఁపుఁదోఁ టన బారు బంతి
పదుపు చాల్ చాలుపు పౌఁజు సొరిది చాలు నాఁగను బంక్తికి నామ మగును


"