పుట:Andhra-Bhasharanavamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయకాండము

క.

శ్రీరఘునాథాఖ్యాకమ, హీరమణమనోబ్జభృంగ హీరనిభాంగా
వారణదైత్యవిభంగా, భూరిగుణనివేశ మాతృభూతమహేశా!

1


క.

ధరణి పుర శైల వన మృగ, నర వర్ణచతుష్క వర్గ నద్ధత
విరచిత మగు నీకాండము, స్ఫురితగుణనివేశ మాతృభూతమహేశా!

2

భూవర్గము

ఆ.

పుడమి నేల యనిన భూవాచకం బగుఁ, బొల మనంగ నూరిపొత్తు నేల
కృష్ణభూమి వెలయు రేగడ రేవడ, యనఁగ విమలకీర్తి సాంబమూర్తి.

3


ఆ.

గురువు గరుసు నాఁగ ఖరభూమి విలసిల్లు, దువర తుస్సి నాఁగఁ దువరభూమి
విఱిగినాఁగ స్ఫోటపృథివికి సంజ్ఞయౌ, జదరు నా సమోర్వి సాంబమూర్తి.

4


సీ.

మృత్తికాహ్వయములౌ మిత్తిక యం చన మట్టియం చనఁగను మ న్ననంగ
శుద్ధమృత్తిక యొప్పు సుద్దయం చన మీఱు బంకమన్ననఁగఁ గుంభకరమృత్తు
చౌడు కారపుమన్ను చవు డన నూషరమృత్సంజ్ఞ దోఁచుఁ దత్పృథివిపేరు
లు ప్పనఁ జౌ డన నూసర యన నొప్పు జేడెనా నమరుఁ బిచ్ఛిలధరిత్రి
ధరణి విస్తారనిమ్న యై తనరెనేని బాడువ బడువ యనఁగను బరఁగుచుండు
మెట్ట మెరక యనంగను మెఱయుచుండు స్థలికి సంజ్ఞలు మాతృభూతాభిధాన.

5


తే.

పరఁగు నెద్దడినే లన మరుధరిత్రి, కొఱ కనంగను బీడునాఁ గొఱ ననంగఁ
గంచె యన నప్రహతభూమి కాఖ్య లెసఁగుఁ, బడగ మడి యనఁగా నదీప్రాంత మభవ.

6


సీ.

పాండవబీడు నాఁ బరఁగుఁ జిరాప్రహతము పాడు నాఁగను దనరు నప్ర
హతవిశేషము జగం బన లోక మొప్పారు నాణెమం చనఁగ దేశాహ్వయంబు
నాడునా జనపద నామధేయం బగు సీమన దుర్గాఢ్యభూమి వెలయు
వంటెమం చనఁగను వణితమం చనఁగను సీమైకదేశ మై చెలఁగుచుండు
మన్నె మన మండె మనఁగను మాడె మనఁగ దుర్గమస్థలనామ మై తోఁచుచుండు
నీరుముం పనఁ గ్రీనీరునేల యనఁగ ఖ్యాతి గాంచు ననూపంబు మాతృభూత.

7


సీ.

మొరపనేల యనంగ మొరసునేల యనంగ శర్కరిలావనీసంజ్ఞ వెలయు
గోష్ఠంబు దొడ్డినాఁ గొమరారుఁ బెంట నాఁ బరఁగు గౌష్ఠీనంబు పఱగడ యనఁ