ధీ వర్గములు. ప్రధమకాండము. 13
తే. | శ్రీలు వెలయంగ నీపేరఁ జేయుకతనఁ బరఁగు శాశ్వతముగఁ గాలవర్గ మిట్లు | 101 |
ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ
ధీ వర్గము
తే. | బుద్దియం చన వెలయును బుద్ధిసంజ్ఞ, తెలివి యనఁగ నెఱుక యనఁ దెలివిడియనఁ | 102 |
సీ. | అతివిచారణసంజ్ఞ యలరు నెవ్వగ యన ననుమాన మొప్పగు నంచన యనఁ | 103 |
సీ. | ఇయ్యకో లొప్పికో లీకోలు మైకోలు మేకోలు సమకోలు మేము డొడఁబ | 104 |
క. | ఉప్పిడి యనఁ జప్పిడి యనఁ జప్పన యన నలవణాఖ్య చను రసనామం | 105 |
ఆ. | కంపు గబ్బు గవులు గందంబు వల పన, గంధ మొప్పు సురభి కమ్మన యన | 106 |
ఆ. | వెగటు వేదు నాఁగ వికటగంధం బొప్పుఁ, బుస్తు బూజు నాఁగ బూతిగంధ | 107 |
సీ. | వన్నె వన్నియ యన వర్ణంబు విలసిల్లు దెలి తెల్ల తెల్లన తెలుపు వెల్ల | 108 |