పుట:Andhra-Bhashabhushanamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

vi


     జ్ఞానారూఢమనస్కుఁడ
     నానాశాస్త్రజ్ఞుఁడను వినయభూషణుఁడన్." 3

1925 సం. మున వావిళ్లవారు ప్రకటించిన దశకుమారచరిత్రమునకు మొదటఁజేర్చిన తొలిపలుకునఁ గేతనకవినిగుఱించి వ్రాయుచు నక్షత్రచిహ్నముంచి పుటకుఁ గ్రిందిభాగమున గీఁతక్రింద "ఈకేతన కాదంబరి పద్యకావ్యము చేసెనని కొందఱందురు. ప్రబంధరత్నాకరమున కాదంబరి రచించినది మ్రానయ కేతన యని గలదు గాన నతఁ డింకొకఁడు" అని తొలిపలుకు వ్రాసినవారు వ్రాసిరి. దశకుమారచరిత్రాదులు రచించిన కేతన మారయ కేతన యని భ్రాంతిపడుటచేత వా రట్లు వ్రాసియుందురు. మ్రానయ కేతన యన మన యభినవదండియే. వారు వ్రాసినకారణమునుబట్టి వారి యుద్దేశమునకు వ్యతిరేకముగాఁ గాదంబరి యభినవదండి బిరుదాంకితుఁడగు కేతన రచించినట్లే ధ్రువపడుచున్నది. రంగరాట్ఛందంబునందుఁ గేతన కాదంబరిలోనివని కొన్నిపద్యము లుదాహరింపఁబడినవి. వానిలో నొకపద్యముక్రింద భాస్కరుని కేతన యని యుండుటచేత ఆకేతన యితరుఁ డేమోయని యూహింపవలసి యున్నది. కాని